Begin typing your search above and press return to search.
ఈ సీక్రెట్ మ్యారేజ్ ఏంటమ్మా జింటా?
By: Tupaki Desk | 1 March 2016 5:30 PM GMTప్రేమంటా ఇదేరా - రాజకుమారుడు సినిమాల్లో మెరిసిన హీరోయిన్ ప్రీతి జింటా.. ఆ తర్వాత టాలీవుడ్ లో లీడ్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇప్పుడీ భామ తనకు నచ్చినవాడిని పెళ్లి చేసుకుంది. చాలా కాలంగా జీనీ గుడ్ ఎనఫ్ తో ప్రేమలో ఉన్న భామ.. ఎట్టకేలకు చక్కగా పెళ్లి చేసుకుని సెటిలైపోయింది.
లాస్ ఏంజెల్స్ లో ఫిబ్రవరి 29 రాత్రి ప్రీతి-జీనిల పెళ్లి జరిగింది. అది కూడా ఎలాంటి మీడియా హంగామా లేకుండా.. దగ్గరి స్నేహితులు - బంధువుల మధ్యే ఈ వివాహం జరగడం విశేషం. సుసానే ఖాన్ - సురిలీ గొయల్ లు ప్రీతి జింటా పెళ్లికి సంబంధించిన ఫోటోను షేర్ చేయడంతో.. ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ సీక్రెట్ మ్యారేజ్ తోపాటు.. ప్రీతి జింటా పెళ్లి ఏప్రిల్ లో జరుగుతుందనే అంచనాలున్నాయి. ముంబైలో రాజ్ పుత్ స్టైల్లో అత్యంత భారీగా వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రీతి జింటా పెళ్లిపై చాలా కాలం నుంచే రూమర్స్ ఉన్నాయి. అయితే 'నా పెళ్లి అనౌన్స్ మెంట్ ను దయచేసి నాకొదిలేయండి. ఇది నా జీవితం, అప్పటివరకూ నన్ను వదిలేయండి'అంటూ కొంతకాలం క్రితం ట్వీట్ చేసింది ప్రీతి. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను వేలం వేయడం ద్వారా ఛారిటీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ జంట సిద్ధమవుతున్నట్లు సన్నిహితులు అంటున్నారు.
ఇకపోతే.. గతంలో ప్రీతి ఏమని ట్వీటేసింది అంటే.. నేను సీక్రెట్ గా పెళ్ళిచేసుకోబోను.. అలాంటి అవసరం నాకు లేదు.. నా మ్యారేజ్ డేట్ అందరికీ ఎనౌన్స్ చేసే చేసుకుంటా.. అంటూ చెప్పుకొచ్చింది. అలాంటప్పుడు ఈ సీక్రెట్ యవ్వారమేంటమ్మా జింటా?