Begin typing your search above and press return to search.
జైల్లో సల్మాన్ ను కలిసిన హీరోయిన్
By: Tupaki Desk | 6 April 2018 5:32 PM GMTదేశంలోనే కాకుండా ప్రపంచం వ్యాప్తంగా ఇండియా అంటే తెలిసిన ప్రతి ఒక్కరు గురువారం రోజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ గా ఉన్న సల్మాన్ ఖాన్ కి జైలు శిక్ష పడటం అందరిని షాక్ కి గురి చేసింది. రోజు ఏసీల్లో ఉంటూ కాస్ట్లీ లైఫ్ ను ఎంజాయ్ చేసే సల్మాన్ ఖాన్ ఇప్పుడు సాధారణ జైల్లో దినమైన జీవితాన్ని చూస్తున్నాడు. కృష్ణ జింకల వేట కేసులో జోధ్ పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే.
అయితే సల్మాన్ ను ఇప్పటివరకు బాలీవుడ్ నుంచి పెద్దగా ఎవరు పరామర్శించడానికి రాలేదు. ఎవరొచ్చారో కూడా తెలియదు కాని హీరోయిన్ ప్రీతి జింతా మాత్రం వచ్చింది. శుక్రవారం జైల్లో సల్మాన్ ను కలిసి కొంచెం సేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ప్రీతి జింతా జైలు నుంచి బయటకు రావడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో సల్మాన్ - ప్రీతి జింతా కాంబినేషన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇకపోతే సల్మాన్ మొదటి రోజు జైల్లో అస్సలు నిద్రపోలేదట. ఒక రగ్గు కూలర్ మాత్రమే స్పెషల్ గా ఇచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. 1998 లో హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ బ్రేక్ లో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. కేసు కూడా నమోదైంది. దీంతో మూగ జీవుల సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్ ముగా జీవులను చంపినందుకు ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. అయితే ఎక్కువగా సోషల్ మీడియాలో సల్మాన్ కు మద్దతు లభిస్తోంది.