Begin typing your search above and press return to search.
కవలలకు వెల్ కం చెబుతున్న ప్రీతి జింటా
By: Tupaki Desk | 19 Nov 2021 2:30 AM GMTఅందాల నటి ప్రీతి జింటా బిజినెస్ మేన్ జీన్ గూడెనఫ్ ని పెళ్లాడి సినిమాలకు దూరమైనా వ్యాపార రంగంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట గురువారం తమ కవలలు - జై - గియా లను సరోగసీ ద్వారా ఆహ్వానిస్తున్నామని ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. తన తన భర్త ఫోటోను పంచుకుంటూ.. 46 ఏళ్ల ప్రీతి ఒక లేఖను రాసింది.
అందరికీ హాయ్.. నేను ఈ రోజు అద్భుత వార్తను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను .. జీన్ చాలా సంతోషంగా ఉన్నాం. మా హృదయాలు చాలా కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. మేము మా కవలలు జై జింటా గూడెనఫ్ - గియా జింటా గూడెనఫ్ లను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాం.. ఎంతో ప్రేమతో.
మా జీవితంలో ఈ కొత్త దశ గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు వైద్యులు వారి బృందానికి ప్రీతి కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రేమ మరియు కాంతి - జీన్ - ప్రీతి- జై -గియా. #కృతజ్ఞత#కుటుంబం #కవలలు`` అంటూ హ్యాష్ ట్యాగుల్ని జోడించింది.
ప్రీతి జింటా 29 ఫిబ్రవరి 2016న జీన్ గూడెనఫ్ ను వివాహం చేసుకుని లాస్ ఏంజెల్స్ కు వెళ్లింది. తమ కవలలు జై .. గియా గురించి ఈ జంట చేసిన ప్రకటన వారి అభిమానుల్లో వైరల్ గా మారింది. ప్రీతి తరచుగా తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో తనకు.. జీన్ గూడెనఫ్ కు ఇష్టమైన ఫోటోలను పంచుకుంటుంది.
దర్శకదిగ్గజం మణిరత్నం తెరకెక్కించిన `దిల్ సే` (1998) చిత్రంతో ప్రీతి జింటా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇది అస్సాంలో తిరుగుబాటు నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు జాతీయ అవార్డులు ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ప్రత్యేక ప్రస్తావన అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకుంది.
కల్ హో న హో- వీర్ జారా- కభీ అల్విదా నా కెహనా- క్యా కెహనా- సంఘర్ష్- దిల్ చాహ్తా హై- ఫర్జ్ వంటి చిత్రాలలో ప్రీతిజింతా నటించింది.తెలుగులో విక్టరీ వెంకటేష్ .. మహేష్ లాంటి స్టార్ల సరసన ప్రీతి నటించిన సంగతి తెలిసిందే. మహేష్ తొలి పరిచయ చిత్రం రాజకుమారుడుతో టాలీవుడ్ లో ప్రవేశించింది.