Begin typing your search above and press return to search.
జీని బాబుతో వెంకీ హీరోయిన్ పెళ్లా?
By: Tupaki Desk | 23 Nov 2015 3:30 PM GMTఅప్పుడెప్పుడో వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.. లిరిల్ మోడల్ ప్రీతి జింతా. ఆ తరువాత అమ్మడు మహేష్ తో రాజకుమారుడు సినిమా చేసింది కాని పెద్దగా ఇక్కడ హిట్టవ్వలేదు. కాని బాలీవుడ్ లో మాత్రం మాంచి హీరోయిన్ గానే కొన్నాళ్లు ఏలేసింది. 40 ఏళ్ళ ఈ సిమ్లా యాపిల్.. సినిమాలకు దూరమై తరువాత బిజెనెస్ లూ గట్రా చేసిందిలే.
ఇక ఈ మధ్యనే తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ నెస్ వాడియాతో బ్రేకప్ అవ్వడమే కాదు.. అతగాడిపై సెక్సువల్ మొలెస్టేసన్ కేసు కూడా పెట్టింది. ఐపిఎల్ లో పంజాబ్ క్రికెట్ టీమ్ కో-ఓనర్ గా హల్ చల్ చేస్తున్న ఈ సుందరి.. ఈ మధ్యనే ఓ అమెరికన్ తో ప్రేమలో పడిందట. అతగాడి పేరు జీనీ గుడెనఫ్. పూర్తి వివరాలు మీడియాలో ఎవ్వరికీ తెలియవు. అయితే ఈ మధ్యనే ఒక ఇంటర్యూ లో వేరే కొత్త వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు ప్రీతి అంగీకరించింది. నెస్ వాడియో కూడా వేరే అమ్మాయితో హ్యాపీగా ఉన్నాడు.. నేను హ్యాపీగా ఉన్నా.. ఇప్పుడు ఆ కేసు గురించి ఎందుకు అంటూ తాను పెట్టిన హరాస్ మెంట్ కేస్ గురించి అమ్మడు మాట్లాడలేదు.
కట్ చేస్తే.. వచ్చే జనవరిలో అమెరికాలో జీని గుడెనఫ్ ను ప్రీతి జింతా పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏమో సల్మాన్ ఖాన్ టైపులో 50 టచ్ చేసినా పెళ్లి చేసుకోదేమో అనుకుంటున్న సమయంలో.. అమ్మడు పెళ్ళి పీఠలు ఎక్కేయడానికి రెడీ అయిపోయిందే అంటూ బాలీవుడ్ గుసగుసలాడుతోంది ఇప్పుడు. అది సంగతి.