Begin typing your search above and press return to search.
`PK పెళ్లి` అంటూ టూమచ్ గా ఈ రచ్చేమిటీ?
By: Tupaki Desk | 3 Sep 2021 4:42 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ (పీఎస్ పీకే) పేరును పదే పదే దర్శకనిర్మాతలు తమ సినిమాల ప్రమోషన్స్ కి ఉపయోగించుకోవడం చూస్తున్నదే. ప్రతిసారీ పవన్ కల్యాణ్ పేరుతో సినిమాల్ని ప్రమోట్ చేసుకున్నా అవి విజయం సాధించాయి అనేందుకు ఎక్కడా ఆధారం లేదు. అనామక సినిమాలు అనామక కంటెంట్ ప్రమోషన్స్ కోసం నిర్మాతలు తెలివిగా పీకే పేరును అలా వాడేస్తున్నారు మినహా దానివల్ల కంటెంట్ లేని వాళ్లకు థియేటర్లలో ఏమాత్రం వర్కవుట్ కాదన్నది అందరికీ తెలిసిన నిజం.
తాజాగా సోషల్ మీడియాల్లో `PK పెళ్లి చేసుకుంటాడా?` అంటూ ఓ ట్యాగ్ లైన్ వైరల్ అవ్వడం చర్చకు వచ్చింది. ఇంతకీ పీకే ఎవరు? అంటే ప్రేమ్ కుమార్ .. ఇదే టైటిల్ తో సంతోష్ శోభన్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రేమ్ లో- పీ.. కుమార్ లో - కే ని కలిపి పీకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వధువును వెతుక్కునే కుర్రాడి పాట్లతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రేమ్ కుమార్ అలా పెళ్లికి సిద్ధమై ఎదురుచూపులు చూస్తున్న పోస్టర్ కూడా వైరల్ అవుతోంది. `PK పెళ్లి చేసుకుంటారా?` లేదా అనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు సినిమా చూడాల్సిందే అంటూ ప్రచారం హోరెత్తిపోతోంది.
నిజానికి ఇలా అగ్ర హీరోల పేర్లను ఉపయోగించే ఆలోచన కంటే మంచి కంటెంట్ తో ఆకర్షిస్తే బావుండేదేమో! అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఇటీవలి కాలంలో మంచి కథ కంటెంట్ .. గొప్ప నట ప్రదర్శన.. ఉంటే చాలా వరకూ సినిమాలకు మౌత్ టాక్ తోనే విజయం దక్కుతోంది. అగ్ర హీరో పేరును ఉపయోగించుకుంటే అది కేవలం ఆకర్షణ మాత్రమే అవుతుంది మినహా రెండో రోజు నుంచి థియేటర్లకు జనాల్ని రప్పించాలంటే కంటెంట్ తప్పనిసరి. పవన్ పేరును చాలా మంది చాలా రకాలుగా ఉపయోగించుకున్నారు. కేవలం ఉచిత ప్రచార లబ్ధి కోసమే ఇదంతా. కానీ ఆ సినిమాలేవీ హిట్టెక్కలేదు. అయినా ఇలా పవన్ ఇమేజ్ ని క్యాష్ చేసుకునే కంటే మంచి కథ కంటెంట్ పైనే దృష్టి సారిస్తే బావుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. పీకే పేరును ఉపయోగించకుండా క్రియేటివిటీని చూపించి ఉంటే బావుండేది అన్న విమర్శల్ని సంతోష్ అండ్ టీమ్ ఎదుర్కోవాల్సి వస్తోంది.