Begin typing your search above and press return to search.
సల్మాన్ ఈ టార్చర్ ఏంటయ్యా బాబూ?
By: Tupaki Desk | 4 Nov 2015 4:48 AM GMTసల్మాన్ ఖాన్ - సోనమ్ కపూర్ జంటగా సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో ప్రేమ్ రతన్ ధన్ పాయో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ - తెలుగులో ఏకకాలంలో ఈనెల 12న థియేటర్లలోకి రిలీజ్ చేస్తున్నారు. సల్మాన్ కి తెలుగు అనువాదంలో రామ్ చరణ్ వాయిస్ అందించాడు. ఇప్పటికే ప్రేమ్ రతన్ ధన్ పాయో తెలుగు సాంగ్స్ రిలీజయ్యాయి. అయితే వీటిలో లిరిక్స్ పరమ బోరింగ్ - టార్చర్ అన్న విమర్శలొస్తున్నాయి. లిరిక్స్ అర్థం పర్థం లేకుండా గందరగోళంగా ఉన్నాయని మరీ ఓల్డ్ స్టయిల్ లో చెత్తగా ఉన్నాయన్న టాక్ వచ్చింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ లో ప్రేమ్ రతన్ ధన్ పాయో .. అన్న పదాన్ని యథాతథంగా ఉపయోగించారు. తెలుగు ఆడియెన్ కి ఇది మీనింగ్ లెస్ అని అంటున్నారు.
సల్మాన్ ఖాన్ హీరోగా సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలోనే గతంలో మైనే ప్యార కియా - హమ్ ఆప్ కే కౌన్ హై వంటి అద్భుతమైన ప్రేమకథా చిత్రాలు రిలీజై బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. అవి ప్రేమ పావురాలు - ప్రేమాలయం టైటిల్స్ తో తెలుగులోనూ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. ఆ సినిమాలతోనే సల్మాన్ ఖాన్ కి తెలుగులో అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు ఆ అభిమానులంతా ప్రేమ్ రతన్ .. పాటల్ని ఏవగించుకుంటున్నారు. ఇదేం టార్చర్ బాబూ అంటూ బెంబేలెత్తిపోతున్నారు. డబ్బింగ్ కూడా అంతే నాశిరకంగా ఉంటే సినిమా గతి ఏం కాను? అన్న విమర్శలొస్తున్నాయి. గతంలో షారూక్ ఖాన్ హ్యాపీ న్యూఇయర్ కి. ధూమ్ 3కి ఇదే పరిస్థితి. షారూక్ - అమీర్ చేసిన తప్పులే సల్మాన్ రిపీట్ చేస్తున్నాడని అంటున్నారు. ఇంకా 10 రోజులైనా లేదు. ఇప్పుడిలా విమర్శలు.. ఎలా రికవరీ చేస్తారో?