Begin typing your search above and press return to search.
రొటీన్ కంటెంట్ తో రికార్డులే రికార్డులు
By: Tupaki Desk | 14 Nov 2015 5:16 AM GMTఇటీవలి కాలంలో రొటీన్ కంటెంట్ తో - రొటీన్ మూస సన్నివేశాలతో సినిమాలు తీస్తే మన తెలుగు ప్రేక్షకులు నిర్ధాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారని ప్రూవైంది. ఆగడు - బ్రూస్ లీ పరాజయాలు ఆ సంగతిని నిరూపించాయి. అయితే సేమ్ టు సేమ్ రొటీన్ కంటెంట్ తో తెరకెక్కిన ఓ రెండు సినిమాలు మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తూ టాప్ స్లాట్ లోకి దూసుకురావడం ప్రస్తుతం చర్చకొచ్చింది. కోలీవుడ్ లో అజిత్ వేదాళం - బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ప్రేమ్ రతన్ ధన్ పాయో.. ఈ రెండు సినిమాలు పరమ రొటీన్ కంటెంట్ తో తెరకెక్కినవే అయినా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
ఓ పేద కుర్రాడు.. తనలాగే ఉండే ఓ రిచ్ గయ్ ఇంట్లోకి ప్రవేశించాక ఏం జరిగింది ? అన్న ఆసక్తికరమైన స్టోరీతో ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సల్మాన్ ద్విపాత్రాభినయం పెద్ద అస్సెట్. అయితే ఈ సినిమాలో కంటెంట్ పరమ రొటీన్. ఇలాంటి కథలెన్నో గతంలో వచ్చాయి. సన్నివేశాలు కొత్తగా ఏం లేవ్. అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 40కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది.
అలాగే సిస్టర్ సెంటిమెంట్ - ఫ్యామిలీ ట్రీట్ మెంట్ తో ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి తెలుగు - తమిళ్ లో. సేమ్ టు సేమ్ స్టోరీనే దరువు శివ తిప్పి తీశాడు. అయితే అజిత్ స్టార్ డమ్ - ఇమేజ్ తో ఈ సినిమా బాక్సాఫీస్ ని చెడుగుడు ఆడేస్తోంది. దీపావళి రోజు రిలీజైన ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో 50కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ రెండు సినిమాల్ని విమర్శకులు తిట్టిపోస్తూ ఆటాడేసుకున్నా.. వాస్తవ ఫలితం చూస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సి వచ్చింది. దీన్నిబట్టి ఓ విషయం జనాలకు క్లారిటీ రావాల్సి ఉంది. పరమ రొటీన్ సినిమా తీసినా కన్విన్సింగ్ గా - రీజనింగ్ తో తెరకెక్కిస్తే స్టార్ డమ్ అండతో హిట్టు కొట్టొచ్చు.. అది సంగతి!!