Begin typing your search above and press return to search.

పాత చింత‌కాయే అన్నా..100కోట్లు

By:  Tupaki Desk   |   16 Nov 2015 4:44 AM GMT
పాత చింత‌కాయే అన్నా..100కోట్లు
X
స‌ల్మాన్‌ ఖాన్ హీరోగా సూర‌జ్ బ‌ర్జాత్యా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో దీపావ‌ళి కానుక‌గా రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పాత చింత‌కాయ క‌థ‌తో - ఓల్డ్ ఫార్ములాతో వ‌చ్చిన రొటీన్ సినిమా అంటూ విమ‌ర్శ‌కులు ఏకి పారేశారు. కానీ విమ‌ర్శల‌తో ప‌ని లేకుండా రిలీజైన మొద‌టి మూడు రోజుల్లోనే న‌100 కోట్ల క్ల‌బ్‌ లో చేరింది. తొలిరోజు గురువారం 40 కోట్లు - ఆ త‌ర్వాతి రోజు అంటే శుక్ర‌వారం 31 కోట్లు - శ‌నివారం నాడు 30 కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. మూడు రోజుల్లో కేవ‌లం హిందీ వెర్ష‌న్‌ 101.47 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. భ‌జ‌రంగి భాయిజాన్ త‌ర్వాత మ‌ళ్లీ అసాధార‌ణ‌మైన విజ‌యం ద‌క్కించుకుంది ఈ సినిమా.

స‌ల్మాన్ - సూర‌జ్ బ‌ర్జాత్యా.. అంటేనే సూప‌ర్‌ హిట్ కాంబినేష‌న్‌. వీరి నుంచి హ‌మ్ ఆప్కే హై కౌన్‌ - హ‌మ్ సాత్ సాత్ హై వంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్స్ వ‌చ్చాయి. ఈ రెండు చిత్రాల‌కు ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేశారు. దాదాపు 16ఏళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమాని హిందీతో పాటు, తెలుగు - త‌మిళ్‌ లోనూ అనువ‌దించి రిలీజ్ చేశారు. హిందీ వెర్ష‌న్ వ‌సూళ్ల‌కు తెలుగు - త‌మిళ్ వ‌సూళ్లు క‌లిపితే మ‌రింత సంఖ్య పెరుగుతుంది. ఓ రిచ్ ఫ్యామిలీలోకి ఎంట‌రైన ప్రేమ్ (స‌ల్మాన్ ద్విపాత్రాభిన‌యం) అక్క‌డ ఫ్యామిలీలో ఉన్న క‌ల‌త‌ల్ని ఎలా తొల‌గించాడ‌న్న‌దే సినిమా. 1980ల నాటి టైమ్ మెషీన్ ఫార్ములాని ఇందులో ఉప‌యోగించ‌డం క్రిటిక్స్‌ కి ఎంత మాత్రం న‌చ్చ‌లేదు. అయితే ఎవ‌రికి న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా ఈ మూవీ బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌. కేవ‌లం 60 కోట్ల‌తో తెర‌కెక్కి దేశ వ్యాప్తంగా రిలీజై ఇప్ప‌టికి 100 కోట్లు పైగా వ‌సూలు చేసింది. అదీ సంగ‌తి.