Begin typing your search above and press return to search.
ప్రకంపనలు రేపిన ఆ సినిమాకు 35 ఏళ్లు
By: Tupaki Desk | 18 Feb 2016 1:24 PM GMT37 కేంద్రాల్లో విడుదలైతే 30 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. 29 కేంద్రాల్లో 25 వారాలు ఏకధాటిగా ప్రదర్శితమైంది. 21 కేంద్రాల్లో 200 రోజులు.. 10 కేంద్రాల్లో 300 రోజులు.. 8 కేంద్రాల్లో 365 రోజులు.. 6 కేంద్రాల్లో 500 రోజులు.. 3 కేంద్రాల్లో 75 వారాలు ప్రదర్శితమైంది. అంతే కాదు.. లేట్ రిలీజ్ లో మరో 13 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. బహుశా తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. భారతీయ సినీ చరిత్రలో సైతం ఇలాంటి రికార్డులు సాధించిన సినిమా ఇంకేదైనా ఉంటుందా.. ఒక్క ‘ప్రేమాభిషేకం’ తప్ప. కనీ వినీ ఎరుగని.. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రికార్డులు సాధించిన ఆ సినిమా విడుదలై నేటికి 35 ఏళ్లు పూర్తవడం విశేషం.
సరిగ్గా 35 ఏళ్ల కిందట.. 1981 ఫిబ్రవరి 18న ప్రేమాభిషేకం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు అద్భుత అభినయం.. శ్రీదేవి అందం... జయసుధ నటనా కౌశలం.. వీటన్నింటికీ తోడు దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వ ప్రతిభ తోడై ఒక గొప్ప సినిమా ప్రేక్షకుల తెలుగు ప్రేక్షకుల్ని మురిపించింది. ‘ప్రేమాభిషేకం’కు కథ - మాటలు - స్ర్కీన్‌ప్లే - దర్శకత్వంతో పాటు పాటలు రాసింది కూడా దాసరినే కావడం విశేషం. కథగా చెప్పుకొంటే అందులో గొప్పతనమేమీ కనిపించదు. కానీ అద్భుతమైన ట్రీట్ మెంట్ తో ఈ సినిమాకు ప్రాణం పోశారు దాసరి.
ఈ సినిమాకి మరో ముఖ్య ఆకర్షణ చక్రవర్తి పాటలు. తారలు దిగి వచ్చిన వేళ.. వందనం అభివందనం... కోటప్పకొండకు వస్తానని.. నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని.. ఆగదు ఆగదు... దేవీ మౌనమా.. ఇలా ప్రతి పాటా ఓ ఆణిముత్యమే.సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. విజయవాడలో శతదినోత్సవం.. అన్నపూర్ణ స్టూడియోలో రజతోత్సవం.. చెన్నైలో స్వర్ణోత్సవం.. నెల్లూరులో త్రిశతదినోత్సవం.. ఇలా ఈ సినిమాకు ఎన్నెన్ని వేడుకలో.