Begin typing your search above and press return to search.

మెకోవర్ తో షాక్ ఇచ్చిన యువ హీరో

By:  Tupaki Desk   |   4 Jan 2023 4:30 AM GMT
మెకోవర్ తో షాక్ ఇచ్చిన యువ హీరో
X
మలయాళం సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులు చూపించే డెడికేషన్ మాములుగా ఉండదు. అక్కడ డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చాలా ఎక్కువగానే వస్తుంటాయి. కేవలం ఒక జానాల్లో కాకుండా స్టార్ హీరోలు అన్ని రకాల జానర్ సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ కామెడీ అడ్వెంచర్ ఇలా అన్ని తరహా సినిమాలను వారికున్న లిమిటెడ్ బడ్జెట్ లోనే చేస్తూ ఉంటారు.

అయితే నటీనటులు అక్కడ ఊహించిన విధంగా వారి ఫిట్నెస్ లో మార్కులు చేస్తూ కూడా కొంత ఆచార్యాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇప్పటికీ మలయాళం నటుడు మోహన్ లాల్ మమ్ముట్టి ఇద్దరు కూడా ఆరుపదుల వయసు దాటినా కూడా వారి గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.

అయితే ఇప్పుడు వారి తరహా లోనే మరో యువ హీరో కూడా తన ఫిట్నెస్తో ఒక్కసారిగా ఊహించని మార్పులు తీసుకొచ్చాడు.

మాలీవుడ్ నటుడు నివిన్ పౌలీ గత సంవత్సరం పడవెట్టు సాటర్డే నైట్ అనే రెండు సినిమాలలో కనిపించాడు. ఇక ఈ నటుడు తన కొత్త లుక్ తో మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివిన్ పౌలీకి సంబంధించిన కొత్త ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. పిక్స్‌లో నటుడు ఫిట్‌గా సన్నగా కనిపిస్తున్నాడు.

అందరూ 'ప్రేమమ్' నివిన్ ఈజ్ బ్యాక్ అని వ్యాఖ్యానించారు. గతంలో చాలా లావుగా ఉన్న ఈ నటుడు ఫిట్‌గా ఉండటానికి గత మూడు నెలల్లో చాలా వర్కౌట్స్ చేసినట్లు తెలుస్తోంది. నివిన్ పౌలీ యొక్క అంకితభావాన్ని అతని అభిమానులు అభినందిస్తున్నారు. ఇక అతని సినిమాల విషయానికి వస్తే.. నివిన్ పౌలీకి ఈ సంవత్సరం ఆసక్తికరమైన లైనప్ ఉంది. ప్రేమమ్ డైరెక్టర్ తోనే మరో సినిమా చేస్తున్నాడు.

అలాగే అతను ఇతర ఇండస్ట్రీలలో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆమధ్య తమిళ హీరో సినిమాలో కూడా అతను నటించబోతున్నట్లు ఒక టాక్ అయితే వినిపించింది. కానీ ఈ హీరో తన పాత్ర ఏంటో డిఫరెంట్ గా ఉంటే కానీ ఏ సినిమా చేయడానికి ఒప్పుకోడు. అలాగే ప్రేమమ్ డైరెక్టర్ తోనే ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.