Begin typing your search above and press return to search.

20 లక్షల మంది ‘ప్రేమమ్’లో పడిపోయారు

By:  Tupaki Desk   |   26 Sep 2016 11:36 AM GMT
20 లక్షల మంది ‘ప్రేమమ్’లో పడిపోయారు
X
మలయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’ను తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారన్నపుడు చాలామంది రకరకాల సందేహాలు వ్యక్తం చేశారు. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని రీమేక్ చేయడం కరెక్టేనా.. ఒరిజినల్ చేసిన మ్యాజిక్ ను తెలుగు వెర్షన్ రిపీట్ చేస్తుందా.. జనాలు ఈ సినిమా మీద అంత ఆసక్తి చూపిస్తారా.. అన్నారు. కానీ తెలుగు ‘ప్రేమమ్’కు సంబంధించి ఇప్పటిదాకా బయటికి వచ్చిన ప్రతి విశేషమూ జనాల్ని ఆకట్టుకుంది. గత నెలలో రిలీజ్ చేసిన ఎవరే పాట ఇన్ స్టంట్ హిట్టవగా.. తాజాగా ‘ప్రేమమ్’ ట్రైలర్ కూడా తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం మన ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో చెప్పడానికి ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో వస్తున్న స్పందనే నిదర్శనం.

‘ప్రేమమ్’ ట్రైలర్ యూట్యూబ్ లో 2 మిలియన్ మార్కును అందుకోవడం విశేషం. రెండో రోజుకే 10 లక్షల మంది ఈ ట్రైలర్ చూడగా.. ఇప్పుడు 20 లక్షల మార్కును కూడా దాటేసింది. చందూ మొండేటి మాతృకను చెడగొట్టకుండా అందులోని ఫీల్ ను కొనసాగిస్తూ ‘ప్రేమమ్’ను తీర్చిదిద్దాడని ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. విశేషం ఏంటంటే.. మలయాళ ‘ప్రేమమ్’కు ట్రైలర్ కట్ చేయలేదు. చందూ మాత్రం ఆసక్తికర ట్రైలర్ తో వచ్చాడు. ఈ సినిమాను ప్రతి విషయంలోనూ మాతృకతో పోల్చి చూస్తారనడంలో సందేహం లేదు. అలా చూసే శ్రుతి హాసన్ విషయంలో కొందరు అనవసర కామెంట్లు చేశారు. ఐతే మలయాళ ‘ప్రేమమ్’ను చూసిన కళ్లతోనే తెలుగు ‘ప్రేమమ్’ను చూస్తే కష్టం. అలా కాకుండా ఓపెన్ మైండ్ తో ఈ సినిమా చూస్తే కచ్చితంగా నచ్చుతుందనే అనిపిస్తోంది. ‘ప్రేమమ్’కు సరిగ్గా సరిపోయే చైతూ.. ‘కార్తికేయ’ లాంటి సెన్సేషనల్ మూవీ తీసిన చందూ మొండేటి కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా అంచనాల్ని అందుకుంటుందనే భావిస్తున్నారంతా.