Begin typing your search above and press return to search.
ప్రేమమ్ ప్రైవేట్ పాటలు భలే భలే
By: Tupaki Desk | 27 Jun 2016 7:52 AM GMTకొన్ని సినిమాలకి ప్రేక్షకుల్లో ఏర్పడే క్రేజ్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. ఫలానా కాంబినేషన్‌లో సినిమా అనేసరికి అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్టు - ఫ్యాన్ మేడ్ టైటిల్ లోగోలు తయారు చేసుకొని వాటిని చూసుకొంటూ మురిసిపోతుంటారు. అవి ఆన్ లైన్ లోనూ వైరల్ అవుతుంటాయి. అదే తరహా క్రేజ్ నాగచైతన్య ప్రేమమ్ చిత్రానికీ ఏర్పడింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏకంగా ఫ్యాన్ మేడ్ సాంగ్సే పుట్టుకొస్తున్నాయి. మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం ప్రేమమ్.
అందులోని పాటలు ఆన్ లైన్ ద్వారా ఎంతో ప్రాచుర్యం సంపాదించాయి. వాటిని చూసుకొంటూ ఆ ట్యూన్స్ కి తగ్గట్టుగా ఔత్సాహిక అభిమానులు తెలుగు లిరిక్స్ ని సిద్ధం చేశారు. వాటిని రికార్డ్ చేసి మరీ ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. అవి ప్రైవేట్ ప్రేమమ్ పాటలుగా జనాల నోళ్లల్లో నానుతూ ఉన్నాయి. మలయాళంలో విజయవంతమైన... మలరే - అలువా పుజయుదే పాటలకి తెలుగు వెర్షన్ రెడీ చేసి ఆన్ లైన్ లో పెట్టేశారు ఔత్సాహిక అభిమానులు. అవి మలయాళం సినిమాలోని పాటలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ప్రైవేట్ పాటలే ఇలా ఉంటే సినిమాలోని పాటలు ఇంకెంతగా అలరిస్తాయో చూడాలి. మ్యూజికల్ హిట్టుగా నిలిచిన ప్రేమమ్ కి సంబంధించి తెలుగు వెర్షన్ పాటల విషయంలోనూ దర్శకుడు చందు మొండేటి చాలా జాగ్రత్తలు తీసుకొన్నాడని తెలిసింది. ఆ పాటల్ని సిద్ధం చేయించడంలోనూ, వాటిని తెరకెక్కించడంలోనూ చందు మొండేటి తన మార్క్ ని చూపించినట్టు సమాచారం. కార్తికేయ సినిమాలోనూ చందు మొండేటి పాటల్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. అందుకు రెట్టింపు స్థాయిలో ప్రేమమ్ పాటలు ఉంటాయని ఆ సినిమా వర్గాలు చెబుతున్నాయి.