Begin typing your search above and press return to search.
RRR ప్రమోషన్స్ కోసం ప్రిపరేషన్స్ ఆ లెవల్లో
By: Tupaki Desk | 9 Oct 2021 8:31 AM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పాపులరైన సంగతి తెలిసిందే. తెలుగు-హిందీ- తమిళం సహా పలు భాషల్లో ఈ చిత్రం అత్యంత భారీగా రిలీజ్ కానుంది.
జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలవుతుందని జక్కన్న బృందం వెల్లడించింది. ప్రస్తుతం `రౌద్రం రణం రుధిరం` ప్రమోషన్స్ లో వేగం పెంచేందుకు జక్కన్న బృందం సన్నాహకాల్లో ఉంది. మిగిలి ఉన్నది కేవలం రెండు నెలలు మాత్రమే. ఈ రెండు నెలల్లో అన్ని భాషల్ని కవర్ చేస్తూ ప్రచారం చేయాలి. అది కూడా అక్కడ స్థానిక భాషల్లోనే చిత్రబృందం ప్రచారం నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. అంటే స్థానిక భాషను నేర్చుకుని మరీ బరిలోకి దిగాలన్నది ప్లాన్.
ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఆల్రెడీ తన పాత్రకి డబ్బింగ్ ని ప్రారంభించారని తెలిసింది. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ కి అత్యంత భారీగా బిజినెస్ పూర్తయిన సంగతి తెలిసిందే. అందుకే రిలీజ్ ముందే భారీగా హైప్ తేవాలన్న ప్లాన్ తో జక్కన్న ఇక స్పీడ్ పెంచనున్నారని తెలిసింది.
బాహుబలి తరహా బిజినెస్ ప్లాన్..
బాహుబలి రిలీజ్ సమయంలో ప్రమోషన్స్ ఇన్ బిల్టెడ్ మర్కంటైల్ (టాయ్స్ తయారీ వగైరా) బిజినెస్ మరో లెవల్లో వర్కవుటైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కి ప్రమోషన్ తో పాటు.. ఇదే బ్రాండ్ తో బిజినెస్ ని సైతం చేస్తున్నారు. ఇప్పటికే ఓ వెబ్ సైట్ రానాతో లాంచ్ చేయించి అందులో కాస్ట్యూమ్స్ సహా కొన్ని ఆర్స్ట్ వర్స్క్ విక్రయించడం హాట్ టాపిక్ గా మారింది. తద్వారా సినిమాకు కోట్లాది రూపాయల పబ్లిసిటీ ఉచితంగా లభించింది. అంతకు ముందు ఓ ప్రమోషనల్ సాంగ్ ని సైతం రిలీజ్ చేయగా వైరల్ అయ్యింది.
అందులో సంగీత దర్శకుడు కీరవాణి సహా మరికొంత మంది సింగర్లను దోస్తీ సాంగ్ లో చూపించారు. ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ సాంగ్ గాను నిలిచింది. ఈ నేపథ్యంలో రాజమౌళి మరో ప్రమోషనల్ సాంగ్ ని మార్కెట్ లోకి వదలబోతున్నారు. ఈసారి సింగర్స్ కాకుండా నేరుగా సినిమాలో నటించిన నటీనటులను చూపించబోతున్నారు. దాదాపు మెయిన్ పాత్రల్లో నటించిన వారంతా ఇందులో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎవరెవరు? ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారు? అన్న దానిపై ప్రేక్షకాభిమానులకు ఓ అంచనా వుంది. ఈ నేపథ్యంలో ఈ వీడియో సినిమాకి మరింత రీచబిలిటీని పెంచుతుందని నమ్ముతున్నారు.
ఆర్.ఆర్.ఆర్ కి గంగూభాయి నుంచి పోటీ
ప్రతిష్ఠాత్మక ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది ఆలియా భట్. సైమల్టేనియస్ గా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న గంగూభాయి కతియావాడి చిత్రీకరణలోను ఆలియా పాల్గొంది. ఆసక్తికరంగా ఈ రెండు సినిమాలు 2022 జనవరిలో విడుదల కానున్నాయి.
గంగూబాయి కతియావాడీ టీజర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. ఇందులో వేశ్యగా ఆలియా నటనకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు దక్కాయి. ఆలియా నటిస్తున్న గంగూభాయ్ పాత్ర గురించి ప్రస్తుతం టాలీవుడ్ లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ ఆమె పాత్ర ప్రత్యేకత ఏమిటి? అంటే.. గంగూభాయ్ ఒక సాధారణ గుజరాతీ అమ్మాయి. 16 వయసులో ప్రేమలో పడి తల్లిదండ్రుల్ని ఎదురించి ప్రియుడితో ముంబైకి లేచిపోయి పెళ్లి చేసుకొంది. తన చిన్నతనం నుంచి సినీ నటి కావాలే కోరికతో ఉన్న గంగూభాయ్ ఆశా పరేఖ్- హేమామాలిని వంటి స్టార్లను ఆదర్శంగా తీసుకొని సినీ పరిశ్రమలోకి ప్రవేశించాలని ప్రయత్నించారు. కానీ ప్రాణంగా ప్రేమించిన వాడు వేశ్యావాటికకు రూ.500కోసం అమ్మేస్తాడు. ఆ తర్వాత గంగూభాయికి ఎదురైన అనుభవాలేమిటి? అన్నదే గంగూభాయ్ కతియావాడి కథాంశం.
వేశ్యా వాటికలో ఎన్నో అఘాయిత్యాలు. అన్నిటినీ గంగూభాయ్ భరిస్తుంది. గ్యాంగ్ స్టర్ కరీం లాలా గ్యాంగ్ కు చెందిన సభ్యుడు గంగూభాయ్ ని రేప్ చేస్తాడు. తనపై అత్యాచారం చేసిన వాడిని నిలదీస్తూ కరీంలాలానే ప్రశ్నించిన వేశ్యగా సంచలనాలకు తెర తీస్తుంది. ఆ తర్వాత లాలా తనకు రాఖీ కట్టి న్యాయం చేస్తాడు. ఈ పాత్రలో అజయ్ దేవగన్ నటించారు.
ముంబై హెరా మండీ రెడ్ లైట్ ఏరియాలో ఎంతో మంది మహిళలకు అండగా నిలిచిన గొప్ప మహిళగా గంగూభాయ్ పేరు నాడు మార్మోగింది. వేశ్యలకు ఆమె ఆశాదీపం. వేశ్యావాటికలకు అమ్మాయిల్ని బలవంతంగా తేకూడదనే నియమం ప్రకారం ఎందరినో కాపాడింది. అందుకే ఇప్పటికి ముంబై రెడ్ లైట్ ఏరియాలో ప్రతి ఇంట్లో గంగూభాయ్ ఫోటో ఉంటుందట. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ ఇంతకుముందు దీనిపై `మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై` పేరుతో నవలను రాయగా అది సంచలనం సృష్టించింది. దానినే భన్సాలీ సినిమాగా తీసారు.