Begin typing your search above and press return to search.
వీడియో: మెగాస్టార్ల లఘు చిత్రం జిమ్మిక్కు అదిరెనులే
By: Tupaki Desk | 7 April 2020 9:50 AM GMTఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్.. ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. సెలబ్రిటీలు సెల్ఫ్ క్వారంటైన్ నియమం పాటిస్తున్నారు. అయితే ఇంతలోనే ఎలా తెరకెక్కిందో కానీ.. ఇదిగో ఈ లఘుచిత్రం ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో మెగా గిగా టెరా బైట్ స్పీడ్ తో అంతర్జాలంలో దూసుకుపోతోంది. ఇంతకీ అందులో అంత కంటెంట్ ఏం ఉంది? స్టార్లు ఎవరు? అంటారా.. అయితే వీడియో చూస్తే సరి.
స్టారాధిస్టార్లంతా ఏకమై చేసిన ఈ ప్రయత్నానికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఇందులో అసలేం ఉంది? అంటే మహమ్మారీ కరోనాను తుదముట్టించే థీమ్ ఉంది. లాక్ డౌన్ ప్రాశస్త్యాన్ని సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పే సింపుల్ లఘు చిత్రమిది. కేవలం కొన్ని నిమిషాలే అయినా అదిరిపోయిందనే చెప్పాలి. ఫ్యామిలీ అన్న టైటిల్ తో తెరకెక్కించిన ఈ లఘు చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. తమ్ముళ్లుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ రజనీకాంత్.. కొడుకులుగా ... రణబీర్ కపూర్.. దిల్జీత్ లాంటి తారాగణం కనిపించారు. ఇంకేం ఉంది.. వీళ్ల ఫ్యాన్స్ లో జెట్ స్పీడ్ తో ఫ్యామిలీ షార్ట్ ఫిలిం వైరల్ అయిపోతోంది.
ఇంతకీ కాన్సెప్ట్ ఏమిటి? అంటే కుటుంబ పెద్ద కళ్ల జోడు కనిపించడం లేదు. వెతికి ఇచ్చేదెవరు? అంటే ఎంత అరిచినా పట్టించుకునే నాధుడే లేడు. ఇక పట్టించుకున్న ఒక్కడికీ అసలు రిప్లయ్ అన్నదే లేదు కుటుంబం లో అన్నదమ్ములు.. పుత్ర రత్నాలు ఇతరత్రా కుటుంబీకుల నుంచి.. ఇదీ సింపుల్ కాన్సెప్ట్. కరోనాని ఎదుర్కోవాలంటే ఒకరికొకరు కాంటాక్ట్ అన్నదే లేకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పిన షార్ట్ ఫిలిం ఇది. అమితాబ్ ఇంటి పెద్దగా కనిపిస్తే చిరంజీవి.. మోహన్ లాల్.. రజనీ లాంటి స్టార్లు ఆ ఇంటి సభ్యులుగా కనిపించారు.
``బాత్రూమ్ లో నీళ్లే రావడం లేదు.. కళ్ల జోడు ఎక్కడి నుంచి వస్తుంది...`` అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ట్విస్ట్ అదిరింది. ఇందులోనే ప్రియాంక చోప్రా- అలియాభట్- ప్రసూన్ జిత్- శివరాజ్‌కుమార్- సొనాలి లాంటి స్టార్లు కనిపించారు. `ఫ్యామిలీ` షార్ట్ ఫిల్మ్ సోమవారం రాత్రి 9 గంటలకు సోనీ టీవీలో ప్రసారం చేశారు. సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఈ వీడియో జెట్ స్పీడ్ గా వైరల్ అయ్యింది. ఇంతకీ ఒక్కొక్కరూ ఒక్కో రాష్ట్రంలో ఉన్నారు .. లాక్ డౌన్ వేళ ఇదెలా తెరకెక్కింది? అంటే అక్కడే ఉంది లాజిక్కు జిమ్మిక్కు. ఎక్కడివారు అక్కడే ఉండగా.. ఎక్కడికక్కడే ఎవరి పోర్షన్ వాళ్లు నటించి వీడియో తీసి పంపితే దీనిని ఎడిట్ చేసి ఇలా లఘు చిత్రంగా వదిలారన్నమాట. ఏదేమైనా అద్భుత ప్రయత్నమే ఇది. ``ఈ దేశంలో వున్న సినీ కార్మికులంతా ఒక్కటే కుటుంబం. అయితే లాక్‌డౌన్ కారణంగా ఫిల్మ్ వర్కర్స్ డైలీ లేడర్స్ అంతా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వారందరికీ అండగా వుంటాం. ఎవ్వరు భయాందోళకు గురికావద్దు. భయపడొద్దు. విపత్తు సాధ్యమైనంత తొందర్లోనే అంతమవుతుంది`` అంటూ అమితాబ్ వీడియో చివరిలో సముదాయించడం ఆసక్తికరం. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ లో స్ఫూర్తి నింపే ప్రయత్నం. జన జాగృతం చేసే యత్నానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.