Begin typing your search above and press return to search.
క్వీన్ కి అరుదైన గౌరవం
By: Tupaki Desk | 19 Jan 2019 5:24 AM GMTస్వాతంత్య్ర సమరయోధురాలు - క్వీన్ ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా `మణికర్ణిక` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. తెలుగు - తమిళం - హిందీలో ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేసేందుకు కంగన టీమ్ సన్నాహకాల్లో ఉంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కి పలువురి సెలబ్రిటీల ప్రశంసలు దక్కాయి.
తాజాగా ఈ సినిమాని వారం రోజుల ముందే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి స్పెషల్ షో ప్రదర్శించడం విశేషం. దిల్లీ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ఈ షోని వీక్షించారు ప్రథమ పౌరుడు. రామ్ నాథ్ తో పాటుగా భాజపా సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ ఈ ప్రివ్యూని వీక్షించారు. ఈ సందర్భంగా షో అనంతరం రామ్ నాథ్ - ఎల్.కె.అద్వానీ - క్వీన్ కంగన - మణికర్ణిక రచయిత విజయేంద్ర ప్రసాద్ - ప్రసూన్ జోషి తదితరులు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోల్ని రాష్ట్రపతి భవన్ సోషల్ మీడియా వర్గాలు అధికారికంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కంగనను - మణికర్ణిక టీమ్ ను రాష్ట్రపతి సన్మానించడం మరో హైలైట్.
మణికర్ణిక షో వేయాల్సిందిగా రాష్ట్రపతి రామ్ నాథ్ అంతటి వారే స్వయంగా క్వీన్ కంగన టీమ్ ని కోరడం .. ఆ వెంటనే తమ కోసం ప్రత్యేకంగా ప్రివ్యూ షోని ఏర్పాటు చేయడం ఆసక్తికరం. ఇది ఓ రకంగా కంగనకు దక్కిన అరుదైన గౌరవం అనే చెప్పాలి. ఝాన్సీ రాణి పాత్రలో నటించడం ఓ అదృష్టం అనుకుంటే - ఇప్పుడు దేశ ప్రథమ పౌరుడే సినిమా వీక్షించేందుకు ఆసక్తి చూపడం అరుదైన గౌరవం అనడంలో సందేహం లేదు.