Begin typing your search above and press return to search.
'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా' ఛైర్మన్ గా పరేష్ రావల్
By: Tupaki Desk | 10 Sep 2020 5:00 PM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `శంకర్ దాదా ఎంబిబిఎస్`లో డాక్టర్ మామగా నటించిన పరేష్ రావల్ ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. శంకర్ వర్సెస్ డాక్టర్ మామ ఎపిసోడ్స్ ఫుల్ జోష్ ని పంచాయి ఆ చిత్రంలో. బాలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీస్ లోనూ ఆయన చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించారు. ఆయన తనకంటూ యూనిక్ ప్రెజెంటేషన్ తో అభిమానుల గుండెల్లో నిలిచిన నటుడు.
ఆయన స్కూల్ ఆఫ్ డ్రామా స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. స్టేజీ నటుడిగా రాణించి వెండితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించారు. అందుకే ఆయనకు సరైన గుర్తింపు దక్కింది ఈరోజు. పరేష్ రావల్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డి- దిల్లీ) కు కొత్త ఛైర్మన్ పదవిని స్వీకరించనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గురువారం స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ ఎంపికను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా స్వాగతించింది. ప్రస్తుతం దీనికి అధ్యక్షత వహించే ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ అర్జున్ డియో చరణ్ నుండి చైర్మన్ పదవిని పరేష్ రావల్ తీసుకోనున్నారు. వినోద పరిశ్రమకు చేసిన కృషికి 2014 లో భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన భారత ప్రభుత్వం రావల్ కి పద్మశ్రీని ప్రదానం చేసింది. 1994 లో వోహ్ చోక్రీ & సర్ లో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు.
డాక్టర్ మామకు దక్కిన గౌరవం.. తాజా ఎంపికపై అటు బాలీవుడ్ సహా ఇటు టాలీవుడ్ లోనూ ఆసక్తి నెలకొంది. పరేష్ రావల్ కామెడీ నటుడిగా పరిశ్రమలో అడుగుపెట్టారు. అందాజ్ అప్నా అప్నా- చాచి 420- హేరా ఫేరి- నాయక్- ఆంఖేన్- అవరా పాగల్ దీవానా- హంగమా- హల్చల్- దీవానే హుయ్ పాగల్- గరం మసాలా- ఫిర్ హేరా ఫేరి- గోల్‌మాల్: ఫన్ అన్‌లిమిటెడ్ భాగ్- మలమాల్ వీక్లీ- భూల్ భూలైయా- స్వాగతం- ఓఎంజి - ఓహ్ మై గాడ్!- వెల్‌కమ్ బ్యాక్- టైగర్ జిందా హై- సంజు లాంటి చిత్రాల్లో పరేష్ నటించారు.