Begin typing your search above and press return to search.
ఇలాంటి టైంలో ఈ డప్పు కొట్టించుకోవడం అవసరమా...?
By: Tupaki Desk | 30 April 2020 2:30 AM GMTప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రెటీలు లాక్ డౌన్ సమయాన్ని 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజుతో టైమ్ పాస్ చేస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ లో ఇప్పుడు స్టార్ హీరోలు సైతం పాల్గొంటున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి పనుల్లో ఆడవారికి సాయపడాలనే ఉద్దేశ్యంతో మొదలైన ‘బి ద రియల్ మ్యాన్‘ ఛాలెంజ్ టాలీవుడ్ ప్రముఖులు ఒకరి తరువాత మరొకరికి చేరుతూ ముందుకు సాగుతోంది. ఈ ఛాలెంజ్ లో ఒకరిద్దరు మినహా ఇప్పటికే స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్లు.. మ్యూజిక్ డైరెక్టర్లు.. నిర్మాతలు అందరూ పాల్గొన్నారు. అయితే ఈ ఛాలెంజ్ లు సెలబ్రెటీలు ఇంట్లో పనుల కోసం కాదు.. వారి ప్రమోషన్స్ కోసమే చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వస్తున్నాయి.
అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగాని వాడుకొని 'బీ ది రియల్ మ్యాన్' అని ఏదో వాళ్ళ ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రొమోషన్స్ కోసం ట్రిపుల్ ఆర్ టీమ్ ట్రై చేస్తోందని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు అందరూ దాన్ని వాడుకొని హీరోలంతా కూడా ఏదో పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సరేలే లాక్ డౌన్ టైమ్ ని ఇలా యూజ్ చేసుకుంటున్నారులే పోనిలే అనుకుందాం. అయితే ఇప్పటి దాకా ఈ ప్రచారం కేవలం సోషల్ మీడియా వరకే పరిమితమైంది. ఇప్పుడు ఎల్లలు దాటి ఏకంగా ప్రెస్ నోట్లు కూడా పంపించేంత వెర్రి లోకి వచ్చేసింది.
వివరాల్లోకి వెళ్తే 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజులో భాగంగా లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ సవాలుని స్వీకరించవలసిందిగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దేవిశ్రీ కూడా సుక్కు విసిరిన ఛాలెంజ్ ను పూర్తి చేసినట్లు ట్వీట్ చేసి వీడియో రిలీజ్ చేసాడు. రియల్ మ్యాన్ లను తయారు చేసిన 'అమ్మ'లందరికీ ఈ వీడియో అంకితం అంటూ వీడియో ద్వారా తెలియజేసాడు. అనంతరం ఇలాంటి ఎంటర్టైనింగ్ ఎఫర్ట్స్ పెట్టిన సందీప్ వంగా, -రాజమౌళి - చిరంజీవి లను ట్యాగ్ చేస్తూ ఈ ఛాలెంజ్ ను కొనసాగించాల్సిందిగా అల్లు అర్జున్ - తమిళ హీరో కార్తీ - కన్నడ హీరో యశ్ - హరీష్ శంకర్ - దిగ్గజ నటుడు మోహన్‌లాల్ లను నామినేట్ చేశాడు.
ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఇప్పటి దాకా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తుండగా ఇప్పుడు ఏకంగా 'దేవిశ్రీ ప్రసాద్ చేసిన వీడియోకి అనూహ్య స్పందన' అని ప్రెస్ నోట్లు కూడా ఇచ్చారట. దేశవ్యాప్తంగా ప్రజలు కరోనా వల్ల ఇబ్బందులు పడుతుంటే.. ఇలాంటి టైములో ఈ అనవసర ప్రచారం అవసరమా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక సినిమాకి సుమారు 3 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకునే దేవిశ్రీ తన మ్యూజిక్ ఫ్యామిలీకి ఏదైనా స్పెషల్ గా సాయం చేయాల్సింది పోయి ఈ డప్పు కొట్టించుకోవడం ఏంటని సినిమా జనాలు విమర్శిస్తున్నారు.