Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: డాలర్ డ్రీమ్స్ పై సూపర్ సెటైర్!
By: Tupaki Desk | 8 Feb 2020 12:21 PM GMTటాలీవుడ్ సినిమాల తీరులో గత కొంతకాలంగా మార్పు కనిపిస్తోంది. న్యూ జెనరేషన్ ఫిలిం మేకర్లు ఇంట్రెస్టింగ్ కాన్సెప్టులతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇదే కోవలో నవతరం సినిమా 'ప్రెజర్ కుక్కర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజోయ్ & సుశీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి రోనక్.. ప్రీతీ అస్రాని.. రాహుల్ రామకృష్ణ.. రాజై రోవన్.. కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది.
ఎక్కువ మంది తెలుగు పేరెంట్స్ అభిప్రాయమే హీరోగారి నాన్నగారికి ఉంటుంది. "అమెరికా పోతేనే సక్సెస్ఫుల్ ఐతవురా.. ఇండియాలో ఉండే ఏం జేసిన వేస్టే" అంటూ చిన్నతనం నుంచి నూరిపోస్తూ ఉంటాడు. ఇక హీరో బీటెక్ పూర్తయిన తర్వాత అమెరికా వీసా కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అందరూ "అరె కిషోర్ విసా రిజెక్ట్ అయిందటగా" అని అడుగుతూ ఉంటారు. ఇక ఈ హీరో తన ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ కు వచ్చి ఏదో ఒక పని చేసి విసా సాధించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ లో రాహుల్ రామకృష్ణ ఒకరు. ఇక తనికెళ్ళ భరణి అమెరికా గొప్పదనం గురించి.. అక్కడ డాలర్లు సంపాదించే తమ డాషింగ్ పిల్లల గురించి ఎంతో గొప్పగా చెప్తూ హీరోకు.. హీరో ఫ్రెండ్స్ కు చిరాకు తెప్పిస్తూ ఉంటారు. ఎంతో కష్టపడి ట్రై చేస్తూ ఉన్నప్పాటికీ విసా మాత్రం రిజెక్ట్ అవుతుంది.
పిల్లలు అమెరికాకు పోయి సెటిల్ అయితేనే గొప్ప కాదని.. పిల్లలు తల్లిదండ్రుల కంటి ముందు ఉంటే అది మరింత సంతోషం అని ఒక నటుడి చేత చెప్పించారు. సినిమా థీమ్ ఇదేనని మనం అనుకోవచ్చు. ఇక హీరో.. హీరోయిన్ ట్రాక్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. హీరో-హీరోయిన్ లవ్ సీన్స్ అందంగా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్.. ఇంట్రెస్టింగ్ ట్రైలర్. డాలర్ల మైకంలో ఉండేవారికి తప్ప మిగతా వారికి వెంటనే కనెక్ట్ అవుతుంది.. ఆలస్యం ఎందుకు.. ఒక లుక్కేయండి.