Begin typing your search above and press return to search.
సైరా డెడ్ లైన్@50.. సూరిపై ఒత్తిడి
By: Tupaki Desk | 31 Jan 2019 8:03 AM GMTమెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి నటిస్తున్న `సైరా- నరసింహారెడ్డి` చిత్రాన్ని దసరా బరిలో రిలీజ్ చేస్తామని నిర్మాత రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఏడాది కాలంగా ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇన్ టైమ్ లో పూర్తి చేసి దసరా కానుకగా మెగాభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని తపిస్తున్నారు.
అయితే ఇన్ టైమ్ లో ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయగలరా? భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కి సంబంధించిన సినిమా కాబట్టి అంత పెర్ఫెక్ట్ గా రిలీజ్ చేయగలరా? అంటూ ఫిలింవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. శంకర్ దర్శకత్వం లోని.. ఐ, 2.0 వంటి భారీ వీఎఫ్ ఎక్స్ చిత్రాల విషయంలో జరిగిన జాప్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇటీవలే పిగ్ లెట్ మూవీని `అదుగో` పేరుతో గ్రాఫిక్స్ లో క్రియేట్ చేసిన రవిబాబుకు కష్టం ఎదురైంది. ఈ అనుభవాల్ని సైరా టీమ్ దృష్టిలో పెట్టుకుంటోందట. మరోవైపు రిలీజ్ లకు రెడీ అవుతున్న హిస్టారికల్ వారియర్ చిత్రాల్ని `సైరా` టీమ్ నిశితంగా పరిశీలిస్తోంది. కంగన- క్రిష్ ల `మణికర్ణిక` చిత్రంలో సైరాకు పోలికలు ఉన్నాయో అంటూ ఆరా తీసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు `సైరా- నరసింహారెడ్డి` చిత్రాన్ని యూనిక్ గా తీర్చి దిద్దేందుకు చాలా కోణాల్లో ఆలోచించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
చిత్రీకరణ ఇంకా ఎంత పెండింగ్ ఉంది? అని అంటే.. ఇప్పటికి ఇంకా 50రోజుల షూటింగ్ చేయాల్సి ఉంది. రాజస్థాన్ కోటల్లో, రామోజీ ఫిలింసిటీ సెట్స్ లో బ్యాలెన్స్ చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. అవసరం మేర హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో సెట్స్ లోనే చిత్రీకరణ పూర్తి చేస్తున్నారన్న సమాచారం ఉంది. ఏప్రిల్ నాటికి టాకీ మొత్తం పూర్తయితే వేగంగా సీజీ వర్క్ పూర్తి చేసి డెడ్ లైన్ ప్రకారం రిలీజ్ చేసేందుకు వీలుంటుంది. ఆ మేరకు నిర్మాత రామ్ చరణ్ దర్శకుడు సురేందర్ రెడ్డిపైనా ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది. చెప్పిన టైమ్ కి రిలీజ్ చేసి సత్తా చాటాలన్న ఛాలెంజ్ ని సైరా టీమ్ స్వీకరించిందట. ప్రస్తుతం ఆన్ లొకేషన్ యుద్ధ ప్రాతిపదికన ప్రతిదీ పూర్తి చేస్తున్నారు. దసరా డెడ్ లైన్.. అంటే 50రోజుల్లో టాకీ మొత్తం పూర్తయితే, సునాయాసంగా రిలీజ్ చేసే వీలుంటుందన్నది ప్లాన్ అని తెలుస్తోంది. దసరాకి సైరా రిలీజ్ తేదీపై క్లారిటీ వచ్చేస్తే ఆ సీజన్ లో ఇతర రిలీజ్ లకు పూర్తి క్లారిటీ ఇచ్చేయడం వీలవుతుందనడంలో సందేహం లేదు.