Begin typing your search above and press return to search.

ఓటీటీల్లో మ‌ళ్లీ టిక్కెట్టు కొనుక్కోవాలా.. పాజిబులేనా?

By:  Tupaki Desk   |   7 Sep 2020 5:00 PM GMT
ఓటీటీల్లో మ‌ళ్లీ టిక్కెట్టు కొనుక్కోవాలా.. పాజిబులేనా?
X
సంవ‌త్స‌రానికి రూ.1200 లోపు చెల్లింపుల‌తోనే అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్షిప్ పొందే వీలుంది. ఇది నిజంగా ఓ వ‌రం. కుటుంబ స‌మేతంగా కొత్త సినిమాల్ని వీక్షించే వెసులుబాటు ఉంటుంది ఇక్క‌డ‌. పైగా క‌రోనా క్రైసిస్ లో థియేట‌ర్లకు వెళ్లాల్సిన ప‌నే లేదు. ఇక ఇత‌ర వేదిక‌ల‌తో పోలిస్తే ఓటీటీలో అమెజాన్ బెట‌ర్ గా ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న గొప్ప సినిమాల్ని తెలుగు స‌బ్ టైటిల్స్ తో అందిస్తూ అమెజాన్ మిగ‌తావాళ్ల కంటే బెట‌ర్ గానే ఉంది. ఈ వేదిక మంచి అనువాదాల్ని అందిస్తోంది.

ఇక స‌బ్ స్క్రైబ‌ర్లు పెర‌గడానికి కార‌ణం కూడా లోక‌ల్ భాష‌ల్లో మంచి సినిమాల్ని అందించే ప్ర‌య‌త్న‌మే. అయితే అమెజాన్ ప్రైమ్ వాళ్ల‌కు తెలుగు మార్కెట్ అంత‌గా వ‌ర్క‌వుట్ కావ‌డం లేద‌న్న వాద‌న అంత‌కంత‌కు బ‌ల‌ప‌డుతోంది. తాజాగా నాని- సుధీర్ బాబు నటించిన `వి` డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రికార్డు ధర రూ .33 కోట్లకు కొనుగోలు చేసిన అమెజాన్ త‌డబాటుకు లోనయిన‌ట్టు గుర్తించింద‌ట‌. ఈ సినిమాకి స‌మీక్ష‌లు స‌రిగా లేవ్. టాక్ మిక్స్ డ్ గా రావ‌డంతో అది కాస్తా మైన‌స్ గా మారింద‌ట‌.

దీని ప్ర‌భావం మునుముందు మార్కెటింగ్ శైలిపైనా ప‌డ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక కొత్త సినిమాల‌కు కొత్తగా పే పెర్ వ్యూ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చేందుకు అమెజాన్ ఆలోచిస్తోంద‌న్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది. ఇది నిజంగా ఇప్ప‌టికే స‌బ్ స్క్రైబ్ అయిన వాళ్ల‌కు శాప‌మే. మ‌ళ్లీ అద‌న‌పు మొత్తాలు చెల్లించి సినిమా చూడాల్సి వ‌స్తే అది నిజంగా ఇబ్బందిక‌రం. కానీ భారీ బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్కే చిత్రాలకు భారీ మొత్తాలు చెల్లించాల్సి రావ‌డం అమెజాన్ ప్రైమ్ కు ఇబ్బందిక‌ర‌మేన‌న్న మ‌రో కోణం చ‌ర్చ‌కొచ్చింది. అయితే ప్ర‌తిసారీ ప్ర‌తి సినిమాకి రూ.50 నుంచి వంద పెట్టాలంటే అది సామాన్యుల‌కు ఎంత పెద్ద భార‌మో అంచ‌నా వేయాలి. అందువ‌ల్ల ఆ ప్ర‌భావం స‌బ్ స్క్రిప్ష‌న్ల‌పై పడుతుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు.

నిజానికి క్రేజీ సినిమాల్ని రిలీజ్ చేసిన‌ప్పుడు స‌బ్ స్క్రైబ‌ర్లు పెరుగుతున్నారు. హిట్టు టాక్ వ‌స్తే ప‌దే ప‌దే అదే సినిమాని రిపీటెడ్ గా చూసేవాళ్లుంటారు. అలాంట‌ప్పుడు ప్రైమ్ వాళ్లు కొత్తగా అద‌న‌పు పేమెంట్ విధానాల్ని ప‌రిచ‌యం చేయ‌డం స‌రికాదు. ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తెర‌వ‌రు. బిజినెస్ విధానంలో మోడ‌ల్ మార్చాలి. ముందే నిర్మాత‌ల‌తో కాస్ట్ కంట్రోల్ ప్రాతిప‌దిక‌న అమెజాన్ స‌హా ఓటీటీ వాళ్లు ప్లాన్ చేస్కుంటేనే బెట‌ర్ గా ఉంటుందేమో! హీరో మార్కెట్ రేంజును బ‌ట్టి బ‌డ్జెట్ల‌ను మ‌దించి మంచి క్వాలిటీ కంటెంట్ ని అందించే ప్ర‌య‌త్నం చేయాలి త‌ప్ప జ‌నం నుంచి పిండే ఆలోచ‌న వ‌ర్క‌వుట‌వ్వ‌నే అవ్వ‌దు.