Begin typing your search above and press return to search.

ప్రిన్స్ - సర్దార్.. 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

By:  Tupaki Desk   |   23 Oct 2022 2:08 PM GMT
ప్రిన్స్ - సర్దార్.. 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
X
దీపావళి పండుగలో ఇద్దరూ తమిళ హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద ఫైటింగ్ స్టార్ట్ చేశారు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నారు అనే వివరాల్లోకి వెళ్తే.. ముందుగా కార్తీ నటించిన సర్దార్ సినిమా పర్వాలేదు అనిపించే విధంగా ఓపెనింగ్స్ అయితే అందుకుంది. ఈ సినిమా తప్పకుండా తెలుగులో సక్సెస్ అవుతుంది అని కార్తీక్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. అంతేకాకుండా గత కొంతకాలంగా అతనికి తెలుగులో కూడా సరైన విజయాలు లేవు.

తమిళంలో అడపాదడపా సక్సెస్ అందుకుంటున్నాడు కానీ తెలుగులో మాత్రం కార్తీ సక్సెస్ చూసే చాలా కాలం అయ్యింది. ఇక అతని తెలుగు మార్కెట్ కూడా చాలావరకు తగ్గిపోయింది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ అయితే అందుకుంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 5.50 కోట్ల బిజినెస్ అయితే చేసింది.

ఇక మొత్తం రెండు రోజుల్లో నైజాం ఏరియాలో 87 లక్షలు అందుకున్న ఈ సినిమా సీడెడ్ లో 23 లక్షలు ఆంధ్ర మొత్తంలో కూడా 90 లక్షల షేర్ మాత్రమే అందుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు రోజుల్లో సర్దార్ సినిమా 2 కోట్లకు వసూళ్లకు కలెక్ట్ చేసింది. ఇంకా ఈ సినిమా సక్సెస్ సాధించాలి అంటే మరో 3.50 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సి ఉంటుంది.

ఇక ప్రిన్స్ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలోనే విడుదల అయింది. జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా మొదటి నుంచి కూడా మంచి అంచనాలను ఏర్పరచుకుంది. ఇక ఈ సినిమా మొదటి రోజు తెలుగులో అయితే చాలా తక్కువగ కలెక్షన్లు అందుకుంది. ఫస్ట్ డే ఏపీ తెలంగాణలో దాదాపు 90 లక్షల షేర్ వచ్చింది.

ఇక రెండవ రోజు 46 లక్షల షేర్ మాత్రమే దక్కింది. ప్రిన్స్ మొత్తంగా ఏపీ తెలంగాణలో రెండు రోజుల్లో 1.36 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది. తెలుగులో అయితే ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే ఏడు కోట్ల వరకు షేర్ కలక్షన్స్ అందుకోవాల్సి ఉంది. ఇక కలెక్షన్స్ బట్టి చూస్తే ఇంకా 5.64 కోట్ల షేర్ రావాల్సి ఉంది. ఇండియా మొత్తంలో కూడా ప్రిన్స్ ఫస్ట్ డే 6.25 కోట్ల నెట్ కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇక రెండవ రోజు కూడా అదే తరహాలో 5 కోట్లకు నెట్ కలెక్షన్స్ అందుకుంది. తెలుగులో అయితే ఈ సినిమా నష్టాలను కలిగించేలా ఉంది.