Begin typing your search above and press return to search.
ఇండియాకు సపోర్ట్ గా ప్రిన్స్ మహేష్
By: Tupaki Desk | 8 Jun 2019 7:53 AM GMTమహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో సహా ఫారిన్ ట్రిప్ వెళ్ళిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు హాలిడేస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ సరిలేరు నీకెవ్వరు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనా రెగ్యులర్ షూటింగ్ కు ఇంకా టైం ఉంది కాబట్టి ఆలోపు సమయాన్ని పూర్తిగా ఆస్వాదించబోతున్నాడు. దీనికి ఇప్పుడు వరల్డ్ కప్ ఫీవర్ కూడా తోడు కానుంది.
రేపు ఇండియా ఆస్ట్రేలియాల మధ్య జరిగే కీలకమైన లీగ్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మహేష్ లండన్ లోని కేవింగ్టన్ ఓవల్ గ్రౌండ్ కు వెళ్లనున్నాడు. ఇండియా ఇప్పటికే సౌత్ ఆఫ్రికా మీద గెలిచి మంచి ఊపులో ఉంది. రేపు ఇద్దరు టైటిల్ ఫెవరెట్స్ మధ్య జరిగే మ్యాచ్ కాబట్టి హైప్ మాములుగా లేదు. గ్రౌండ్ కిక్కిరిసిపోయేలా ఉంది. భారతీయుల మద్దతు భారీగా ఉండబోతోంది ఈ నేపథ్యంలో ఇలాంటి జోష్ కి మహేష్ తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా.
తనతో పాటు నమ్రతా గౌతమ్ సితారలు మ్యాచ్ వీక్షిస్తారు. ఒకవేళ అదే సమయంలో ప్రిన్స్ ఫ్యాన్స్ అక్కడే ఉంటే కలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడి లాగా తొక్కిడి ఉండదు కాబట్టి ట్రై చేయొచ్చు. అక్కడ ఎన్ని రోజులు ఉండి మహేష్ తిరిగి వస్తాడని ఖచ్చితమైన సమాచారం లేదు. నెలాఖరుకు వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్ కు చేరుకునే అవకాశాలు చెక్ చేసుకుని బయలుదేరతారని తెలిసింది. ఒకవేళ టీమ్ ఎఫర్ట్ వల్ల ఇండియా చివరి పోరుకు రీచ్ అయితే మహేష్ అప్పటిదాకా అక్కడే ఉండొచ్చు.