Begin typing your search above and press return to search.
జాతిరత్నం ఖాతాలో మరో హిట్టు పడుతుందా..?
By: Tupaki Desk | 19 Oct 2022 4:30 PM GMT'పిట్టగోడ' అనే ప్లాప్ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అనుదీప్ కేవీ.. దాదాపు ఐదేళ్ల తర్వాత 'జాతిరత్నాలు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నవీన్ పొలిశెట్టి - ఫారియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మాణంలో చేసిన ఈ కామెడీ ఎంటర్టైనర్.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు అనుదీప్ 'ప్రిన్స్' అంటూ మూడో సినిమాతో రెడీ అయ్యాడు.
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ''ప్రిన్స్''. ఇందులో ఉక్రేనియన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - సురేష్ ప్రొడక్షన్స్ & శాంతి టాకీస్ పతాకాలపై ఈ సినిమా రూపొందింది. ఇది శివ కార్తికేయన్ కు తెలుగు డెబ్యూ.. అనుదీప్ కి తమిళ్ డెబ్యూ. ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఇటీవల అనుదీప్ పర్యవేక్షణలో వచ్చిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అనే సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. 'జాతిరత్నాలు' డైరెక్టర్ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించాడు. తన శిష్యులకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించి అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. ప్రమోషన్స్ కూడా బాగానే చేసాడు కానీ.. ఈసారి అతని క్రింజ్ కామెడీ ఫార్ములా వర్కౌట్ అవ్వలేదు. దర్శకత్వం వహించనప్పటికీ ఈ పరాజయం అనుదీప్ అకౌంట్ లోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'ప్రిన్స్' అతని కెరీర్ కు కీలకంగా మారింది.
'జాతిరత్నాలు' సినిమాకి నాగ్ అశ్విన్ - వైజయంతీ మూవీస్ సపోర్ట్ ఉన్నట్లుగానే.. ఇప్పుడు ''ప్రిన్స్'' చిత్రానికి డి. సురేష్ బాబు - ఏషియన్ సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు వంటి నిర్మాతలు బ్యాక్ బోన్ గా నిలిచారు. అందులోనూ శివ కార్తికేయన్ నటించిన 'రెమో' 'వరుణ్ డాక్టర్' మరియు 'కాలేజ్ డాన్' వంటి సినిమాలు తమిళంతో పాటుగా తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకున్నాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్ జనాలకు అతన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం అదనపు ప్రయోజనాన్ని చేకూర్చింది. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస - ఎడిటర్ ప్రవీణ్ కేఎల్ వంటి అగ్రశ్రేణి సాంకేతిక బృందం ఇందులో భాగమైంది. సీనియర్ నటుడు సత్యరాజ్ - తమిళ కమెడియన్ ప్రేమ్ జీ అమరన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఈ అంశాలన్నీ 'ప్రిన్స్' కు పాజిటివ్స్ అని చెప్పాలి.
'జాతిరత్నాలు' సినిమాలో కథ గొప్పగా ఏమీ లేనప్పటికీ.. తనదైన కామెడీ మరియు ప్రధాన పాత్రల చిత్రీకరణతో అందరినీ మెప్పించాడు అనుదీప్. ఇప్పుడు ''ప్రిన్స్'' సినిమాలో పుదుచ్చేరి అబ్బాయి - లండన్ అమ్మాయికి మధ్య ప్రేమ అనే పాయింట్ ని తీసుకొని తన బలమైన కామెడీని జోడించినట్లుగా తెలుస్తోంది. ఇది ప్రేక్షకులకు నచ్చితే మాత్రం మరో బ్లాక్ బస్టర్ అవుతుంది. వరుస విజయాలతో దూకుడుమీదున్న శివ కార్తికేయన్.. టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కలిసి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
''ప్రిన్స్'' సినిమా దీపావళి సందర్భంగా ఈ శుక్రవారం (అక్టోబర్ 21) తెలుగు తమిళ భాషల్లో విడుదల కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.