Begin typing your search above and press return to search.

తెలుగు హీరోతో చేసుంటే ఫలితం మరోలా ఉండేదా..?

By:  Tupaki Desk   |   26 Oct 2022 10:10 AM GMT
తెలుగు హీరోతో చేసుంటే ఫలితం మరోలా ఉండేదా..?
X
సురేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో 'పిట్టగోడ' అనే చిన్న సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అనుదీప్ కేవీ. ఈ చిత్రం ప్లాప్ అవ్వడంతో రెండో ప్రాజెక్ట్ చేయడానికి దాదాపు ఐదేళ్లు పట్టింది. అయితేనేం వైజయంతీ మూవీస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నాగ్ అశ్విన్ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ తో కలిసి 'జాతిరత్నాలు' సినిమా చేసే అవకాశం అందుకున్నాడు.

'జాతిరత్నాలు'సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాండమిక్ టైంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్.. అనూహ్యమైన వసూళ్ళతో సంచలనం సృష్టించింది. నిర్మాతకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో డైరెక్టర్ అనుదీప్ కేవీ పేరు మార్మోగిపోయింది.

టాలీవుడ్ లోని బడా ప్రొడ్యూసర్స్ చాలామంది అనుదీప్ తో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. కొందరు అడ్వాన్సులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తనను డైరెక్టర్ గా లాంచ్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్ మరియు డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ నిర్మాణంలో మూడో ప్రాజెక్ట్ ని తీసుకొచ్చాడు.

తమిళ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న శివ కార్తికేయన్ హీరోగా ''ప్రిన్స్'' చిత్రాన్ని తెరకెక్కించాడు అనుదీప్. అయితే అంతకంటే ముందుగా తన పర్యవేక్షణలో శిష్యులకు దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తూ 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అనే సినిమా చేసాడు. ఇది పరాజయం పాలవ్వడంతో అనుదీప్ తదుపరి చిత్రంతో తానేంటో మరోసారి చూపించాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన 'ప్రిన్స్' సినిమా.. దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. తమిళంలో అంతో ఇంతో వసూళ్ళు రాబడుతున్నా.. తెలుగులో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతోంది. దీని మీద 'సర్దార్' మూవీ డామినేషన్ నడుస్తోంది.

అనుదీప్ తన గత సినిమాల శైలిలోనే 'ప్రిన్స్' చిత్రాన్ని తెరకెక్కించాడు. కాకపోతే 'జాతిరత్నాలు' సినిమాకి పనిచేసిన కామెడీ సిచువేషన్లు - పాత్రల చిత్రీకరణ ఇక్కడ వర్కౌట్ కాలేదు. తమిళ నేటివిటీకి తగ్గట్టుగా తీయడంతో.. తెలుగు ప్రేక్షకులు ఏ దశలోనూ కనెక్ట్ అవ్వలేకపోయారు.

అందులోనూ సినిమా అంతా తమిళ యాక్టర్స్ తో నిండిపోయింది. దీంతో అనుదీప్ కామెడీ టైమింగ్ ను అర్థం చేసుకుని నటించే తెలుగు నటీనటులు లేని లోటు స్పష్టంగా కనిపించింది. 'ప్రిన్స్' లో పాపులర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. తెలుగు స్టార్స్ తో తీసి ఉంటే కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ గా కుదిరి ఉండేదని.. ఫలితం మరోలా ఉండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఏదేమైనా 'పిన్స్' కోలీవుడ్ లో సత్తా చాటాలనుకున్న అనుదీప్ కు ఈ సినిమా రిజల్ట్ తో చుక్కెదురైంది. అంతేకాదు ఒకే రకమైన జోనర్ కు పరిమితం అవుతున్నాడనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు ఈసారి ఎలాంటి చిత్రంతో వస్తాడో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో అనుదీప్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.