Begin typing your search above and press return to search.

కేజీ బియ్యంతోనే వారం -30 ఇయర్స్ పృథ్వీ

By:  Tupaki Desk   |   6 Aug 2015 8:10 AM GMT
కేజీ బియ్యంతోనే వారం -30 ఇయర్స్ పృథ్వీ
X
పరిశ్రమ ఇలా రాంగానే అలా ఎవరికీ రెడ్‌ కార్పెట్‌ వేయదు. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాకే అవకాశాలిచ్చి పెద్దవాడిని చేస్తుంది. సరిగ్గా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఇక్కడ ఎందరో ఎదిగారు. ఆ తరహాలోనే 30ఈర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ కూడా కెరీర్‌ ఆరంభం ఎన్నో తిప్పలు పడ్డాడు. ఆంధ్రా యూనివర్శిటీలో ఎకనమిక్స్‌లో పీజీ పూర్తి చేసిన పృథ్వీ ఓ హోటల్‌ లో వెయిటర్‌ గా, ఓ అతిధిగృహంలో రిసెప్షనిస్టు గా పనిచేశాడు. వీడియో షాప్‌ లోనూ పనిచేసి పొట్ట పోషించుకున్నాడు. ఇదంతా అతడు చెన్నయ్‌ లో ప్రయత్నాలు చేసే క్రమంలో ఫుడ్డు గడవక చేసిన పనులు. అక్కడ ప్రభాకర్‌ రెడ్డి దేవుడి లా నన్ను ఆదుకున్నారని పృథ్వీ ప్రతి సందర్భంలోనూ గుర్తు చేసుకుంటాడు. అంతేనా అతడి కష్టాల జీవితం ఎలా సాగిందో అతడి నోటి వెంటే వినండి మరి....

=1992లో ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో కెరీర్‌ ప్రారంభించాను. రెండు దశాబ్ధాలుగా పరిశ్రమలోనే ఉన్నా. 100పైగా సినిమాల్లో నటించాను. ఈ పయనం అంత సులువేం కాదు. ఎన్నో ఎత్తు పల్లాలు, కష్టనష్టాలు ఇక్కడ. కొన్నిసార్లు ఇక మనవల్ల కాదు.. తిరిగి ఊరెళ్లిపోదాం అనుకునేవాడిని. కానీ ఏదో ఒకరోజు నా పేరు వినబడకపోదు.. అని తిరిగి ఆశతో ప్రయత్నించేవాడిని.

=సొంతూరు తాడేపల్లి గూడెంలో ఉన్నప్పట్నుంచి కల్చరల్‌ ఈవెంట్లలో పార్టిసిపెంట్‌ ని. యూనివర్శిటీలో ఉన్నప్పుడు అంతే యాక్టివ్‌ గా ఉండేవాడిని. అందుకే నేను సినీపరిశ్రమకి వెళతానంటే అమ్మ కూడా అడ్డు చెప్పలేదు. తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంది.

=నాకు రావుగోపాల్‌ రావుగారు ఇన్‌ స్పిరేషన్‌. ఆయన్ని కలిసి ఎన్నో సలహాలు తీసుకున్నా. పరిశ్రమ ఎలా ఉంటుందో చెప్పింది గోపాల్‌ రావుగారే. నా జీవితంలో విలువైన సమయాన్ని ఆయనతో కలిసి గడిపాను.

=ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో నటించిన తర్వాత చెన్నయ్‌ వెళ్లాను. రాత్రులు ఉద్యోగాలు చేస్తూ పొట్ట పోషించుకుని, పగలు సినిమాల్లో ప్రయత్నించేవాడిని. అక్కడ ఉన్నప్పుడు ప్రభాకర్‌ రెడ్డిగారు నన్ను దేవుడిలా ఆదుకున్నారు. ఉద్యోగం ఇప్పించారు. పరిశ్రమలో అవకాశాలిప్పించారు. పరిశ్రమ చెన్నయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ప్రభాకర్‌ గారే సాయం చేశారు. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే ఆ దేవుడి వల్లే. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.

=హైదరాబాద్‌ వచ్చాక కృష్ణానగర్‌ లో ఓ చిన్న రూమ్‌ లో వేరొక స్నేహితుడితో కలిసి ఉండేవాని. ఇద్దరం ఒక కేజీ బియ్యాన్ని వారం వండుకు తినేవాళ్లం. కష్టాలు, బాధలు అన్నిటినీ పంచుకునేవాళ్లం.

=లౌక్యం సినిమాలో 'బాయిలింగ్‌ స్టార్‌ బబ్లూ'గా నటించాను. ఈ పాత్ర నా జీవితాన్ని మార్చేసింది. చక్కని గుర్తింపు తెచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన శ్రీవాస్‌ కి ఎప్పటికీ రుణపడి ఉంటాను.

=డిక్టేటర్‌, కిక్‌2, బెంగాల్‌ టైగర్‌, చరణ్‌ సినిమా, .. అన్నీ పద్ద అవకాశాలే. ఇప్పటికి జీవితంలో సెటిలయ్యా.