Begin typing your search above and press return to search.
#KRKR: ఈసారి లగడపాటిని దించాడు
By: Tupaki Desk | 8 Nov 2019 10:54 AM GMTఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ టైమింగ్ సెన్స్ గురించి.. కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. సెటైర్లు వేయడంలో.. కన్ఫ్యూజ్ చేయడంలో.. మాట మార్చడంలో ఆర్జీవీ తర్వాతనే. అదే కాదు.. అతడిలోని టెక్నికాలిటీస్ గురించి.. కాస్టింగ్ సెలెక్షన్ ట్యాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ప్రస్తుతం `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` (#KRKR) చిత్రంతో సంచలనాలకు తెరతీశాడు. వివాదాలతో ఉచిత ప్రచారం కొట్టేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన పాత్రధారుల్ని పరిచయం చేస్తూ అంతర్జాలంలోనూ మీడియా-రాజకీయ వర్గాల్లోనూ వేడి పెంచుతున్నాడు. చంద్రబాబు -వైయస్ జగన్- నారా లోకేష్-పవన్ కల్యాణ్- దేవినేని వంటి పాత్రల్ని పరిచయం చేశాడు.
తాజాగా ``ఈయనే పొలిటికల్ ఎనలిస్ట్`` అంటూ 30 ఇయర్స్ పృథ్వీని పరిచయం చేశాడు. రాజకీయ విశ్లేషకుడు అంటే ఎవరు? అంటే.. ఇంకెవరు? సీనియర్ నాయకుడు లగడపాటి రాజగోపాల్ అని అభిమానులు గెస్ చేసేశారు. గత ఎన్నికల్లో తేదేపా గెలుస్తుంది!! అంటూ కాకి లెక్కలు చెప్పిన ఎనలిస్ట్ లగడపాటిపై ఆర్జీవీ తనదైన శైలిలో పంచ్ లు వేయబోతున్నాడని అర్థమవుతోంది. పృథ్వీతో బోలెడంత కామెడీ చేయించేందుకు ఆస్కారం ఉంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమంటే లగడపాటి ఆర్జీవీకి ఎంతో సన్నిహితుడు. ఆ ఇద్దరూ ఒకే కాలేజ్ లో చదువుకున్నారు. బెజవాడతో అనుబంధం ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే మరి ఈ ఇంపార్టెంట్ పాత్రను ఎలా చూపిస్తాడు? అన్నది చూడాలి.