Begin typing your search above and press return to search.

అది అస‌లు కిస్ కాదంట‌!!

By:  Tupaki Desk   |   14 May 2018 5:30 PM GMT
అది అస‌లు కిస్ కాదంట‌!!
X

ప్రేక్ష‌కుల‌ను ఏం మోసం చేశారు ఆ టీవీ సీరియ‌ల్ వాళ్లు. ఓ లిప్ లాక్ సీన్ చూపిస్తే అది నిజమేనేమో అని న‌మ్మేశారు పాపం ఆ సీరియ‌ల్ చూసే జ‌నాలు. కానీ ఆ లిప్ లాక్ సీన్ ఫేక్ అంటా. అందులోని హీరోహీరోయిన్లు లిప్ కిస్ పెట్టుకోలేదంటా. సోనీ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే పృథ్వీ వ‌ల్ల‌భ్ - ఇతిహాస్ బి ర‌హ‌స‌య్ భి... సీరియ‌ల్ గురించి ఈ రచ్చంతా. అందులో హీరో హీరోయిన్ల లిప్ కిస్ పెట్టుకున్న‌ట్టు క‌నిపించాగానే అంద‌రూ వావ్ అనుకున్నారు. తీరా అది ఫేక్ కిస్ అని తెలిసి ఇలా కూడా చేస్తారా? అని చ‌ర్చించుకుంటున్నారు.

పృథ్వీ వ‌ల్ల‌భ్ సీరియ‌ల్‌లో సోనారికా బడోరియా ఆశిష్ శ‌ర్మ హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు. స్ర్కిప్టులో భాగంగా వీరి మ‌ధ్య ఓ లిప్ కిస్ ఉంది. అయితే వీరిద్ద‌రికీ అదిష్టం లేదు. అదే విష‌యాన్ని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చెప్పారు. తాము ఆన్‌స్క్రీన్‌పై లిప్ కిస్ పెట్టుకోలేమ‌ని తెగేసి చెప్పారు. పెట్టుకున్న‌ట్టు న‌టించ‌మ‌ని కోరాడు ద‌ర్శ‌కుడు. అలాగే న‌టించారు హీరోహీరోయిన్లు. ఇప్పుడు ఆ విష‌యం వైర‌ల్ అయింది. వాళ్లిద్ద‌రూ లిప్ కిస్ ఫేక్ అంటూ ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయ్‌. దీనిపై సోనారికా మాట్లాడుతూ గ‌తంలో ఓ సినిమాలో తాను లిప్ కిస్ పెట్టాన‌ని... కంఫర్టుబుల్ అనిపించ‌లేద‌ని చెప్పింది. ఈమె మూడు తెలుగు సినిమాల‌లో న‌టించింది. జాదూ గాడు స్పీడున్నోడు ఈడో ర‌కం ఆడో ర‌కం సినిమాల‌లో హీరోయిన్‌గా చేసింది.

పృథ్వీ వ‌ల్ల‌భ్ సీరియ‌ల్ పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం లేదు. టీఆర్పీలు కూడా చాలా త‌క్కువ‌గా వ‌స్తున్నాయ్‌. అందుకే ఆ సీరియ‌ల్‌ను త్వ‌ర‌లో ఆపేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆ స్థానంలో సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్న సీరియ‌ల్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు అయితే పృథ్వీ వ‌ల్ల‌భ్ సీరియ‌ల్‌లో ఈ లిప్ లాక్ సీనే ఎక్కువ మందిని ఆక‌ర్షించింది. కానీ అది ఫేక్ అని తేలిపోయింది.