Begin typing your search above and press return to search.

TMTAU ఆర్టిస్టుల గ్రూప్ ఎన్నిక‌ల ర‌చ్చేమిటో కానీ!

By:  Tupaki Desk   |   5 Nov 2021 7:30 AM GMT
TMTAU ఆర్టిస్టుల గ్రూప్ ఎన్నిక‌ల ర‌చ్చేమిటో కానీ!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల ర‌చ్చ‌ను మ‌ర్చిపోక ముందే ఇప్పుడు హైద‌రాబాద్ కృష్ణాన‌గ‌ర్ లో ఉన్న మ‌రో ఆర్టిస్టుల అసోసియేష‌న్ ఎన్నిక‌ల ర‌చ్చ చ‌ర్చ‌కు వ‌చ్చింది. తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ యూనియ‌న్ (టీఎంటీఏయు) ఎన్నిక‌లు ఈనెల 21న జ‌ర‌గ‌నున్నాయి. అయితే అన్ని అసోసియేష‌న్ల మాదిరిగానే ఈ అసోసియేష‌న్ లోనూ అభ్య‌ర్థుల మ‌ధ్య వార్ కొన‌సాగుతోంది. గ‌త అధ్య‌క్షుని హ‌యాంలో ఆర్థిక కుంభ‌కోణం జ‌రిగింది! అంటూ ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. దాదాపు 1500 పైగా ఆర్టిస్టులు ఉన్న అసోసియేష‌న్ ఇది.

తాజాగా టిఎంటిఏయు కుటుంబ సభ్యులకు మాజీ జాయింట్ సెక్రెటరీ నూకరాజు నాయుడు రాసిన లేఖ క‌ల‌క‌లం రేపుతోంది. ఈ లేఖ ప్ర‌కారం.. కమిటీ లో అక్రమాలు జరిగాయని డబ్బులు వృధా చేశారని కొంతమంది అపవాదు వేసి పోలీస్ స్టేషన్ కి కలెక్టర్ గారికి లేబర్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేసారు. ముందుగా కమిటీని సంప్రదించకుండా సంజాయిషీ అడగకుండా కంప్లైంట్ వెళ్ళిపోయారు. వెళ్లిన వారు వివాదం ఏమిటో అనేది తేలకుండా బాడీ మొత్తం పోటీచేసే అర్హత కోల్పోయారని గ్రూపులో యూట్యూబ్ లో మాట్లాడుతుండ‌డం కరెక్ట్ కాదు. మా దగ్గర సంజాయిషీ అడిగి సమాధానం రాకపోతే అప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళవచ్చు.. కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళవచ్చు.. లేబర్ కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళండి.. మీరు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత మీ వాదన పోలీస్ స్టేషన్లో కలెక్టర్ గారి ఆఫీస్ లో లేబర్ ఆఫీసర్ గారు ఆఫీసులో వారి అండర్ లో ఉంటుంది. మీరు మమ్మల్ని పోటీ చేయడానికి వీలు లేదు అనే అధికారం మీకు ఉండదు. దయవుంచి మీ వాదన గ్రూపులో యూట్యూబ్ లో ఫార్వర్డ్ చేయొద్దు.. అంటూ లేఖ రాసారు.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్రస్తుత ప్రెసిడెంట్ పృథ్వీ రాజీనామా చేసి విధుల నుండి తప్పుకున్నారు. ప్ర‌స్తుతం అవ‌క‌త‌వ‌క‌ల‌పై గుడ్డిలో మెల్లగా ఆర్థిక‌ప‌ర‌మైన ఆడిట్ చేస్తున్నార‌ని వేరొక అభ్య‌ర్థి తెలిపారు. కొంద‌రు స‌భ్యులు పోలీస్ స్టేషన్ లోనూ లేబ‌ర్ ఆఫీస్ లోను కలెక్టర్ గారి వద్ద ఫండ్స్ నీ ఉపయోగించే విషయం లో జరిగిన అవకతవకల గురించి పిర్యాదు చేసారు. దీని మీద ఎటువంటి చర్య తీసుకుంటారో ఎప్పుడు తీసుకుంటారో తెలియని పరిస్థితి ఉంది. గొడ‌వ తేలాకే ఎలక్షన్ ప్రక్రియను పర్యవేక్షించడానికి లేబ‌ర్ క‌మీష‌నర్ తరపు నుండి ఎవరిని పంపుతారో ..వారి ప్ర‌కారం ఎలక్షన్ తేదీ నిర్ణయం జరుగుతుంది. ఎలక్షన్ కమిటీకి కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వవలసి ఉంటుంది. అభ్యర్థులకు 15 రోజులు తమ ప్రచారానికి సమయం ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న సమయం కేవలం 16 రోజులు మాత్రమే.. అని వేరొక అభ్య‌ర్థి వాదన వినిపించారు. మొత్తానికి ఆర్టిస్టుల ఎన్నిక‌లు అంటే ప్ర‌తిష్ఠాత్మ‌కంగానే గ‌డ‌బిడ త‌ప్ప‌ద‌ని అర్థ‌మ‌వుతోంది.