Begin typing your search above and press return to search.
షారుక్ `పఠాన్`పై మలయాళ హీరో కామెంట్స్!
By: Tupaki Desk | 16 Dec 2022 11:30 PM GMTకరోనా తరువాత నుంచి బాలీవుడ్ పూర్తిగా వెనకబడిపోయింది. ఎంతటి క్రేజీ స్టార్ లు నటించిన సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతోంది. ప్రేక్షకుల నిరాదరణకు గురవుతూ వస్తోంది. కార్తీక్ అర్యాన్ లాంటి చిన్న స్టార్ ల సినిమాలు తప్ప ఇప్పటి వరకు బాలీవుడ్ లో బిగ్ స్టార్స్ అనిపించుకుంటున్న ఏ హీరో సినిమా నిలబడలేకపోవడం గమనార్హం. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనుకునే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద హంగామా చేసిన హిందీ సినిమాలు దక్షిణాది చిత్రాల ముందు వెల వెల బోతున్నాయి.
దీంతో ఇప్పటికైనా బాలీవుడ్ మళ్లీ పుంజుకోవాలని, పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని బాలీవుడ్ స్టార్స్ , మేకర్స్ బలంగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ `పఠాన్` మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కింగ్ ఖాన్ షారుక్ నటిస్తున్న `పఠాన్` మూవీ బాలీవుడ్ కు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందని ఆశా భావం వ్యక్తం చేశాడు. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
త్వరలో బాలీవుడ్ లో విడుదల కానున్న సినిమాలు సూపర్ హిట్ కానున్నాయి. ఈ సంవత్సరం హిందీ సినిమాలు సినీ ప్రియుల్ని ఆకట్టుకోలేకపోవచ్చు. కానీ ఇది ఒక దశ మాత్రమే. రానున్న రోజుల్లో ఒక పెద్ద హిట్ తో బాలీవుడ్ దశ తిరగుతుంది. మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయం. బహుషా అది `పఠాన్` సినిమానే కావొచ్చు. అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.
పలు హిందీ సినిమాల్లో నటించిన పృథ్వీరాజ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్, టైగర్‌ష్రాఫ్ కాంబినేషన్ లో రూపొందుతున్న `బడేమియా చోటే మియా` చిత్రంలో నటించనున్నాడు. ఇదిలా వుంటే మలయాళంలో `ఆడు జీవితం`తో పాటు పలు సినిమాల్లో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ ల కలయికలో రూపొందుతున్న `సలార్`లో వరదరాజ మన్నార్ గా అత్యంత పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.