Begin typing your search above and press return to search.
'పుష్ప'కి ఫహద్ ఎలానో SSMB 28 అతడు అలా?
By: Tupaki Desk | 2 Oct 2022 8:30 AM GMTసూపర్ స్టార్ మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ ఎస్.ఎస్.ఎం.బి28 (SSMB 28) మొదటి షెడ్యూల్ పూర్తయింది. దసరా తర్వాత ప్రారంభం కావాల్సిన రెండో షెడ్యూల్ మహేష్ తల్లి ఇందిరాదేవి గారు మరణించిన కారణంగా వాయిదా పడింది. తాజా సమాచారం మేరకు.. రెండో షెడ్యూల్ లో పలువురు అగ్ర తారలు మహేష్ తో పాటు చేరతారని తెలిసింది.
ఇక పాన్ ఇండియా కేటగిరీలో విడుదలను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ క్యాస్టింగ్ ఎంపికలను తెలివిగా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడితో చిత్రబృందం చర్చలు జరుపుతోంది. ప్రాజెక్ట్ పై అతడు సంతకం చేస్తే అధికారిక ప్రకటన వెలువడుతుంది. పుష్ప చిత్రానికి ఫహద్ ఫాజిల్ ఎలా ప్లస్ అయ్యారో అంతకుమించి పృథ్వీరాజ్ ఈ చిత్రానికి ప్లస్ అవుతాడని భావిస్తున్నారు. పృథ్వీరాజ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో అనువాదమై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ మధ్యలో ఎస్.ఎస్.ఎం.బి28 రెండో షెడ్యూల్ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. తదుపరి షెడ్యూల్ లో అందాల కథానాయిక పూజా హెగ్డే కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఇప్పటికే మహేష్ మూవీపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఇంకా రెండో షెడ్యూల్ అయినా పూర్తి కాక ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ ప్రారంభం కావడం షాకిస్తోంది. నాన్-థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాతలు భారీ మొత్తాలను కోట్ చేస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2023లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మహేష్ స్టైలిష్ లుక్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
పాన్ ఇండియా స్క్రిప్టుతోనేనా..?!
అతడు-ఖలేజా తర్వాత మహేష్- త్రివిక్రమ్ జోడీకి హ్యాట్రిక్ చిత్రమిది. మారిన ట్రెండ్ లో త్రివిక్రమ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించనున్నారు. మహేష్ తదుపరి రాజమౌళి దర్శకత్వంలో నటించాల్సి ఉండగా.. అంతకుముందే అతడు పాన్ ఇండియా స్టార్ గా తొలి అడుగు వేసేందుకు త్రివిక్రమ్ తో సన్నాహకాల్లో ఉండడం వేడెక్కిస్తోంది. దీనికోసం స్పెషల్ గా ఉండే కథాంశాన్ని త్రివిక్రమ్ రెడీ చేసారు. ఇది ఒక యూనివర్శల్ యాక్సెప్టెన్సీ ఉన్న పాయింట్ అని కూడా తెలుస్తోంది. ఇప్పటివరకు తన సినిమాల కోసం పాన్-ఇండియా విడుదలను సీరియస్ గా ప్లాన్ చేయని మహేష్ SSMB28 తో హిందీ మార్కెట్లోనూ మ్యాజిక్ చేయాలని భావిస్తున్నారు.
నిజానికి త్రివిక్రమ్ తెరకెక్కించిన `అల వైకుంఠపురములో` చిత్రం హిందీ బెల్ట్ లోనూ పెద్ద హిట్. అందుకే మహేష్- త్రివిక్రమ్ బృందం ఇప్పుడు పాన్ ఇండియా స్క్రిప్టుతో ఆ రేంజులో హిట్టుపై కన్నేశారన్న చర్చా సాగుతోంది. ఉత్తరాది ఆడియెన్ సెన్సిబిలిటీస్ కి తగ్గట్టు గా ఒక అద్భుత కథాంశాన్ని ఈ మూవీకోసం ఎంచుకున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
తెలుగు సినిమాలు ఇటీవల ఉత్తరాదిన బంపర్ హిట్లు కొడుతున్నాయి. పుష్ప- ఆర్.ఆర్.ఆర్ సాధించిన విజయాల తర్వాత మేజర్ - కార్తికేయ 2 బంపర్ హిట్లుగా నిలిచాయి. అందుకే ఇప్పుడు మహేష్ కూడా హిందీ మార్కెట్ పై దృష్టి సారించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు హిందీ వెర్షన్లను ఏకకాలంలో రికార్డు స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ లాంటి ఛరిష్మా ఉన్న హీరో సినిమా హిట్టు టాక్ తెచ్చుకుంటే చాలు. ఉత్తరాదినా చక్కని వసూళ్లతో అదరగొట్టేందుకు ఛాన్సుంటుంది. ఎస్.ఎస్.ఎం.బి28 చిత్రం 2023 ఏప్రిల్ 28న విడుదల కానుంది.