Begin typing your search above and press return to search.

నెట్టింట మారుమ్రోగుతున్న 'జన‌గ‌ణ‌మ‌న‌'

By:  Tupaki Desk   |   11 Jun 2022 1:30 AM GMT
నెట్టింట మారుమ్రోగుతున్న జన‌గ‌ణ‌మ‌న‌
X
మ‌ల‌యాళ క్రేజీ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విభిన్న‌మైన ఆలోచ‌న‌ల‌తో ఆలోచ‌నాత్మ‌క చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నారు. ఆయ‌న డైరెక్ట్ చేసి న‌టించిన ప‌లు సూప‌ర్ హిట్ మూవీస్ ప్ర‌స్తుతం తెలుగులో రీమేక్ అవుతున్నాయి కూడా. ఇటీవ‌ల ఆయ‌న న‌టించగా మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌' తెలుగులో 'భీమ్లానాయ‌క్' పేరుతో రీమేక్ అయిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుంది.

తాజాగా పృథ్వారాజ్ సుకుమార‌న్ న‌టించిన ఓ మూవీ నెట్టింట వైర‌ల్ గా మారి మారుమ్రోగుతోంది. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం 'జ‌న‌గ‌ణ‌మ‌న‌'. డిజో జోస్ ఆంటోనీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, సూర‌జ్ వెంజ‌ర‌మూడు హీరోలుగా న‌టించారు. మ‌మ‌తా మోహ‌న్ దాస్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రానికి మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి వాయిస్ ఓవ‌ర్‌ అందించారు. ఏప్రిల్ 28న విడుద‌లైన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల నీకాజ‌నాలందుకుంది.

నెట్ ఫ్లిక్స్ లోనూ ఈ మూవీని విడుద‌ల చేశారు. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని నెట‌జ‌న్స్ సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం చేస్తూ నెట్టింట మారుబ్రోగిస్తున్నారు. ఇప్ప‌టికే 'జ‌న‌గ‌ణ‌మ‌న‌' టైటిల్ ని స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న లేటెస్ట్ మూవీ కోసం రిజిస్ట‌ర్ చేయించుకోవ‌డం.. విజ‌య్ దేవ‌ర‌కొండ తో సినిమాని కూడా స్టార్ట్ చేయ‌డంతో ఈ చిత్రాన్ని తెలుగులో 'జ‌న‌' పేరుతో విడుద‌ల చేశారు. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం ఒరిజిన‌ల్ టైటిల్ ని ట్రెండ్ చేస్తూ నెటిజ‌న్స్ హాట్ టాపిక్ గా మార్చేశారు.

తెలుగు వెర్ష‌న్ లో సేమ్ టైటిల్ తో సైలెంట్ గా విడుద‌లైన ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుంది. కేవ‌లం 10 కోట్ల తో నిర్మించిన ఈ మూవీ భారీ స్థాయి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచి కేర‌ళ‌లో 50 కోట్లు వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ సినిమాని యూత్, నెటిజ‌న్స్ ఓన్ చేసుకుని నెట్టింట హోరెత్తించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం... ఇటీవ‌ల హైద‌రాబాద్ లో జ‌రిగిన వ‌రుస రేప్ సంఘ‌ట‌న‌లే న‌ని తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం శంషాబాద్ లో జరిగిన రేప్ సంఘ‌ట‌న యావ‌త్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

ఆ త‌రువాత నిందితుల్ని ఎన్ కౌంట‌ర్ చేయ‌డం కూడా సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. వీటితో పాటు ఇటీవ‌ల జ‌రిగిన జ‌రుగుతున్న రేప్ సంఘ‌ట‌న‌ల‌ని ఈ సినిమాలో చూపించ‌డం.. ఓ సాధార‌ణ లాయ‌ర్ త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై స‌మ‌ర శంఖం పూరించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆలోచింప‌జేస్తోంది. ఇదే నెటిజ‌న్ ల‌ని బాగా ఎట్రాక్ట్ చేసి సినిమాని నెట్టింట వైర‌ల్ అయ్యేలా చేస్తోంది. అంతే కాకుండా యూనివ‌ర్సిటీల్లో జ‌రిగే భావ‌జాల అంత‌ర్యుద్ధాల‌ని కూడా ప్ర‌ధానంగా ఈమూవీలో చ‌ర్చించ‌డంతో యూత్ బాగా క‌నెక్ట్ అవుతున్నారు.

సినిమా అంతా రియలిస్టిక్ అప్రోచ్ తో సాగ‌డంతో మ‌న క‌ళ్ల‌ముందు జ‌రుగుతున్న‌ట్టుగా ప్రేక్ష‌కుల‌కు ఫీల్ ని క‌లిగిస్తోంది. దీంతో ప్ర‌తీ ఒక్క‌రూ ఈ మూవీని ఓన్ చేసుకుని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు.

మ‌మ‌తా మోహ‌న్ దాస్ ఇందులో ప్రొఫెస‌ర్ గా న‌టించింది. ఆమెని రేప్ చేసి హ‌త్య చేస్తారు. దీని వెన‌క ఎవ‌రున్నారు? .. ఈ ఉదంతం వెన‌కున్న చీక‌టి కోణాలేంటీ? ఆ నిజాల‌ని బ‌య‌టికి తీయ‌డం కోసం నిజాయితీగ‌ల అడ్వ‌కేట్ ఏం చేశాడు? అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ‌. ఇదే ఇప్పుడు ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో భారీ సినిమాలైన ట్రిపుల్ ఆర్‌, గంగూబాయి క‌తియావాడీ చిత్రాల‌తో పోటీప‌డేలా చేస్తోంది. టాప్ 5 లో నిలిచిన ఈ మూవీ త‌ర స‌త్తాని చాటుతూ రికార్డు స్థాయి వీవ‌ర్షిప్ తో దూసుకుపోతోంది.