Begin typing your search above and press return to search.
ఆకాశంలో అద్భుతం.. స్పేస్ లో సినిమా రష్యా మూవీ..!
By: Tupaki Desk | 23 Dec 2020 2:30 AM GMTఅంతరిక్షం కాన్సెప్ట్ తో సినిమాలు తీయడం మనకు తెలిసిందే. కానీ.. ఇక మీదట అంతరిక్షంలోనే సినిమాలు తీయబోతున్నారు! వినడానికే భలే వింతగా ఉంది కదూ..! అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. త్వరలో ఆకాశ వీధిలో ఈ అద్భుతం జరగనుంది. ఇప్పటి వరకూ వ్యోమగాములు మాత్రమే వెళ్లిన స్పేస్ లోకి.. త్వరలో సినిమా యూనిట్ కూడా అడుగు పెట్టనుంది.
అంతరిక్షంలోకి వెళ్లి సినిమాలు రూపొందించే రష్యా ఉప ప్రధాని చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతరిక్షంలో సినిమా షూట్ గురించి గతనెలలో రష్యా ఉప ప్రధాని యూరీ బోరిసోవ్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఈ విషయమై యూరీ మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘ది ఛాలెంజ్’ పేరుతో అంతరిక్షంలో రూపొందే చిత్రానికి ప్రైవేట్ వ్యక్తులు ఫండింగ్ చేయడానికి ముందుకు వస్తున్నారని వెల్లడించారు.
స్టూడియో ఏర్పాటు..
అంతరిక్షంలో సినిమా స్టూడియో ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు బోరిసోవ్. ‘సినిమా షూటింగుల గురించి మీకు స్పష్టమైన గ్యారెంటీని ఇస్తున్నాను. నా హోదాలో నేను తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాను. అంతరిక్షంలో సినిమాను తీసే విషయంలో నా అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను’ అని అన్నారు బోరిసోవ్.
ఇంకా.. చిత్ర యూనిట్ ఖర్చులను భరించేందుకు స్పాన్సర్లు ముందుకు రావాలని కోరారు. స్పేస్ రీసెర్చ్ గురించి తాను పట్టించుకోనన్న బోరిసోవ్.. సినిమా నిర్మించడమే తన లక్ష్యమన్నారు. ‘ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పరిశోధనలో నేను జోక్యం చేసుకోను. కాకపోతే నా విజన్‌ను వర్కవుట్ చేయడానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను’ అని బోరిసోవ్ పేర్కొన్నారు.
రాస్కోమాస్ ప్రయత్నాలు..
స్పేస్ లో షూటింగుకు అనువుగా ఆర్బిటల్ స్టేషన్‌లో సినిమా సెట్ ఏర్పాటుకు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కోమాస్ విస్తృతంగా ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే.. ఈ సినిమాలో నటించే నాయిక కోసం చూస్తున్నారు. ‘అంతరిక్ష వ్యోమగామిగా మారేందుకు, మానసికంగా, శారీరకంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించే కథానాయిక కోసం వెతుకుతున్నాం. త్వరలోనే హీరోయిన్ ఎంపిక పూర్తి అవుతుంది’ అని బోరిసోవ్ తెలిపారు.