Begin typing your search above and press return to search.

తెలుగమ్మాయిల మధ్య ఆధిపత్యపోరు

By:  Tupaki Desk   |   24 Jun 2015 5:50 AM GMT
తెలుగమ్మాయిల మధ్య ఆధిపత్యపోరు
X
చియాన్‌ విక్రమ్‌ సరసన కథానాయికగా అవకాశం అంటే ఆషామాషీనా? అందుకే ఇద్దరు తెలుగమ్మాయిల మధ్య హోరాహోరీ నడిచింది. పోటీలో చివరికి ఒకమ్మాయి ఓడిపోయింది. వేరొక తెలుగమ్మాయ్‌ గెలిచింది. అసలింతకీ ఎవరీ తెలుగమ్మాయిలు?.. ఒకరు ప్రియా ఆనంద్‌, వేరొకరు బిందుమాధవి.

ఈ ఇద్దరి మూలాలు తెలుగుతో అనుసంధానమై ఉన్నాయి. పూర్వీకులు నివశించింది తెలుగు రాష్ట్రాల్లోనే. కానీ చెన్నయ్‌తోనూ చాలా కాలంగా అనుబంధం ఉంది. అందువల్ల అటు తమిళ సినిమా, ఇటు తెలుగు సినిమా రెండుచోట్లా ఈ భామలు ఆటాడుకున్నారు. ప్రియా ఆనంద్‌ లీడర్‌ సినిమాతో తెలుగు తెరకి పరిచయమై ఆ తర్వాత తమిళ పరిశ్రమలో బిజీ అయిపోయింది. అదే తీరుగా బిందుమాధవి ఆవకాయ్‌ బిర్యానీ, రామ రామ కృష్ణ కృష్ణ వంటి సినిమాల్లో నటించి తర్వాత తమిళ తంబీలతోనే సెటిలైంది. ప్రస్తుతం ఈ ఇద్దరు భామలు తమిళ పరిశ్రమలో ఒకరికొకరు పోటీపడుతున్నారు. ముఖ్యంగా చియాన్‌ విక్రమ్‌ సరసన అవకాశం కోసం పోటీపడ్డారు.

చివరికి రేసులో బిందుమాధవినే అదృష్టం వరించింది. అరిమానంబి ఫేం ఆనంద్‌ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మర్మ మణిథాన్‌ అనేది టైటిల్‌. మలేషియా, బ్యాంకాక్‌, చెన్నయ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో ఈ భామలిద్దరూ పోటీపడింది సెకండ్‌ లీడ్‌ కోసం. ప్రధాన నాయికగా కాజల్‌ ఎంపికైంది. అదీ సంగతి.