Begin typing your search above and press return to search.
దర్శకుడితో ప్రేమలేదు..ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్
By: Tupaki Desk | 28 Jan 2020 8:30 PM GMTతమిళ బుల్లి తెర నుండి వెండి తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియా భవానీ శంకర్. ఈ అమ్మడు వరుసగా దర్శకుడు నటుడు అయిన ఎస్ జే సూర్యతో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం కూడా వీరిద్దరు కలిసి నటించడంతో పాటు చాలా క్లోజ్ గా ఉంటున్నారు. షూటింగ్ గ్యాప్ లో వీరిద్దరు కలిసి తిరుగుతున్నారనే ప్రచారం కూడా చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరిగింది. వీరిద్దరి వ్యవహారం గురించి తమిళ మీడియాలో కుప్పలు తెప్పలుగా కథనాలు వచ్చాయి.
కొన్నాళ్ల క్రితం సూర్య స్పందిస్తూ ప్రియా భవానీ శంకర్ తో తనకు ఎలాంటి ప్రేమ లేదని తామిద్దరం మంచి స్నేహితులం మరియు సహ నటీనటులం మాత్రమే అన్నాడు. అయినా కూడా మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం ఆగలేదు. ఆ వార్తలను ఆపేందుకు ఎట్టకేలకు ప్రియా సిద్దం అయ్యింది. ప్రియ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ పోస్ట్ తో గత కొన్నాళ్లుగా వచ్చిన పుకార్లకు చెక్ పెట్టడంతో పాటు ఇకపై ఎలాంటి పుకార్లు రాకుండా కూడా చేసింది.
ప్రియ తాను ప్రేమలో ఉన్నాను అంటూ నేడు అతడి పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి క్లారిటీ ఇచ్చింది. నీతో పరిచయం అయిన సమయంలో నా మామూలు అందం నీకు ఎలా నచ్చిందనుకున్నాను. ఇప్పటికి నువ్వు నాతో ఉండాలని కోరుకుంటూ ఉండటం నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఒక పాప పుడితే నీలాంటి వ్యక్తి తన జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను. నక్షత్రాలు ఎన్నో ఉంటాయి.. కాని నువ్వు మాత్రమే నా జీవితంలో సూర్యుడివి అంటూ అతడిపై అమితమైన ప్రేమను చూపిస్తూ అతడితో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేసింది. ప్రియా పోస్ట్ తో ఇన్నాళ్ల పుకార్లకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది.