Begin typing your search above and press return to search.

వదిన పై నిప్పులుచెరిగిన స్టార్ హీరో సిస్టర్

By:  Tupaki Desk   |   22 April 2020 8:30 AM GMT
వదిన పై నిప్పులుచెరిగిన స్టార్ హీరో సిస్టర్
X
బాలీవుడ్‌ ఇండస్ట్రీ లో వన్ ఆఫ్ లెజెండరీ ఫ్యామిలీలలో సంజయ్ దత్ ఫ్యామిలీ ఒకటి. సంజయ్ గురించి, ఆయన ఫ్యామిలీ గురించి ఎప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. డ్రగ్స్ అని.. మూడు పెళ్లిళ్లు అనే అంశాలపై ఆ ఫ్యామిలీలో వ్యక్తిగత విభేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆ గొడవలు పక్కన పెడితే.. సంజయ్ మూడో పెళ్లి చేసుకొన్న మాన్యతను కుటుంబ సభ్యురాలిగా అంగీకరించడం లేదనే విషయం మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే ఈ వివాదాలలోఎంపీ ప్రియాదత్ మధ్యలో రావడంతో పెద్ద చర్చే మొదలయ్యింది.

సంజయ్ దత్ వ్యక్తిగత జీవితం చూస్తే.. మొదటి భార్య రిచా శర్మతో 1987లో పెళ్లి జరిగింది. ఆమె క్యాన్సర్ వ్యాధితో చనిపోవడంతో.. రెండో భార్య మోడల్, ఎయిర్ హోస్టెస్ రిహా పిళ్లైతో వివాహం జరిగింది. ఆమెతో వ్యక్తిగత విభేదాల కారణంగా విడాకులు తీసుకొన్నాడు. ఇక మూడోసారి మాన్యతతో పెళ్లి జరిగింది. వారిద్దరికి ఇద్దరు సంతానం. మొదటి భార్యకు త్రిషాల అనే కూతురు ఉంది. మాన్యతను సంజయ్ మూడో పెళ్లి చేసుకోవడం ప్రియా దత్, నమ్రత దత్‌ లకు ఇష్టంలేని విషయం విధితమే. కానీ సంజయ్ దత్ మాత్రం అటు సిస్టర్స్‌ తో - ఇటు భార్యతో రిలేషన్స్‌ను బాగా బాలన్స్ చేస్తున్నాడు.

ఇటీవలే మాన్యత పై సోదరి ప్రియాదత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నా సోదరుడికి లేని ఆలోచనలు కల్పించి.. రాజకీయాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తుంది. తనకు ఇష్టం లేని పనులను చేయిస్తూ.. బాలీవుడ్‌ కు దూరం చేసే ఆలోచనలో ఉందని విరుచుకు పడింది. అంతేగాక మా దృష్టిలో సంజయ్ దత్‌ కు భార్య అంటే చాలా అర్హతలు ఉండాలి. ఎలాంటి అర్హతలు లేని నిన్ను మా ఇంటి కోడలిగా - మా సోదరుడికి భార్యగా ఊహించుకోలేం. లేనిపోని మాటలతో నా సోదరుడిని మాయ చేసిందని ప్రియాదత్ చెప్పుకొచ్చింది.