Begin typing your search above and press return to search.

ప్రియా ఆంటీకే కోపం తెప్పించారేంట్రా..!

By:  Tupaki Desk   |   15 Sep 2021 3:30 PM GMT
ప్రియా ఆంటీకే కోపం తెప్పించారేంట్రా..!
X
తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు నాలుగు సీజన్ లు సూపర్‌ సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం అయిదవ సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్ లో విభిన్నమైన కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ప్రియా ఆంటీ ఒకరు. ఆమె ఎన్నో సినిమాల్లో నటించి ఆంటీగా అందరికి సుపరిచితురాలు అయ్యింది. ఆమె ఒక మంచి వ్యక్తిగా బిగ్ బాస్ హౌస్‌ లో కూడా కనిపిస్తూ వస్తున్నారు. ఆమె బిగ్‌ బాస్ హౌస్ లో అందరితో కలిసి పోయి మాట్లాడుతూనే అందరిపై కూడా కౌంటర్‌ లు వేస్తూ ఉంది. అందరికి సన్నిహితురాలుగా ఉన్న ప్రియా ఏ ఒక్కరి మనసు కూడా నొప్పించకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తుంది. అలాంటి ప్రియకు కోపం వచ్చింది.

నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ లో ప్రియా ఆంటీకి చాలా కోపం వచ్చినట్లుగా ప్రోమోలో చూపించారు. సన్నీ ని ఆమె ఏకంగా మగాడివి అయితే ఆడి చూపించు అన్నట్లుగా మాట్లాడారు. ఆమెకు అంత కోపం వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రియా ఆంటీకి మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందుకే ఆమె ఈసారి నామినేషన్ లో ఉన్నా కూడా ఏమాత్రం భయం అక్కర్లేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను ఖచ్చితంగా సేవ్‌ చేస్తామని ఆమె కంటే వీక్ కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు కనుక ఆందోళన అక్కర్లేదు అంటూ ఆమె అభిమానులు చెబుతున్నారు.

నటరాజ్ మాస్టర్ తో సహా అందరితో కూడా ఆమె చాలా క్లోజ్ గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయినా కూడా గేమ్‌ అన్నప్పుడు ఎక్కడో ఏదో చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. కనుక ఆమెను ఇక్కడ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయితే ఎవరిది తప్పు అనేది క్లారిటీ వస్తుంది. కనుక ఇప్పుడే ప్రియా ఆంటీ గురించి ఒక అభిప్రాయంకు రావద్దు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే సన్నీ అభిమానులు మాత్రం కొందరు వల్గర్ గా కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. మగాడిని మగతనం గురించి మాట్లాడితే ఎక్కడో కాలుతుంది. అప్పుడు గేమ్ మారిపోతుంది ప్రియా గారు అంటూ కొందరు ఆమె తీరును కౌంటర్ చేస్తున్నారు. మొత్తానికి ప్రియా ఆంటీ ఏం చేసింది అనేది క్లారిటీ వచ్చే వరకు ఏం చెప్పలేం.