Begin typing your search above and press return to search.

ప్రియమణి.. పెళ్ళి.. పార్టీ.. ఫినిష్

By:  Tupaki Desk   |   25 Aug 2017 5:18 AM GMT
ప్రియమణి.. పెళ్ళి.. పార్టీ.. ఫినిష్
X
తారలు ఇచ్చే పార్టీలు అంటే భారీ ఆర్భాటంతో ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. పైగా పెళ్లిలాంటి లైఫ్ టైం ఈవెంట్స్ కోసం అయితే.. ఎంత మొత్తం అయినా ఖర్చు చేసేస్తుంటారు సెలబ్రిటీలు. కానీ హీరోయిన్ ప్రియమణి మాత్రం పెళ్లి విషయంలో సింపుల్ గానే చేసేసుకుంది.

దాదాపు ఏడాది క్రితం తన బాయ్ ఫ్రెండ్ ముస్తాఫా రాజ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రియమణి.. రెండు రోజుల క్రితం బెంగళూరులోని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంది. సింపుల్ గా దండలు మార్చేసుకుని.. పెళ్లి పేపర్లపై సంతకాలు చేసి.. ఫోటోలు దిగేసి.. పెళ్లి కానిచ్చేసింది ఈ హీరోయిన్. ఇలా పెళ్లి ఫోటో నెట్ లో వచ్చిందో లేదో.. వేలకొద్దీ అభినందనలు వెల్లువెత్తాయి. అయితే.. పెళ్లి తర్వాత ఇచ్చిన పార్టీ మాత్రం ఏ రేంజ్ లో ఉంది. ఓ ప్రైవేట్ క్లబ్ లో ఇచ్చిన కాక్ టైల్ పార్టీకి భారీ స్థాయిలో తారలు హాజరయ్యారు.

శాండల్ వుడ్ నుంచి అకుల్ బాలాజీ.. రిక్కీ కేజ్.. యోగీష్ ద్వారికేష్ లు ఈ పార్టీకి హాజరైతే.. టాలీవుడ్ నుంచి అల్లు శిరీష్.. జగపతి బాబులు ఇక్కడ సందడి చేశారు. అలాగే మలయాళ పరిశ్రమ నుంచి ప్రియమణి క్లోజ్ ఫ్రెండ్ పెరల్ మానే హాజరైంది. అందరూ కలిసి లేటెస్ట్ హిట్ సాంగ్స్ కు డ్యాన్స్ ఇరగదీసేశారు. ముఖ్యంగా అల్లు శిరీష్.. పెరల్ చేసిన డ్యాన్సులు అదిరిపోయాయని టాక్. ఆ విధంగా ప్రియమణి పెళ్ళి.. వెనువెంటనే పార్టీ.. అన్నీ ఫినిష్‌ అయిపోయాయ్.