Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ 'న్యూడ్' ఫోటో కోరిన యూసర్.. ఆమె ఏమందంటే??

By:  Tupaki Desk   |   31 March 2021 5:30 PM GMT
స్టార్ హీరోయిన్ న్యూడ్ ఫోటో కోరిన యూసర్.. ఆమె ఏమందంటే??
X
ఇండస్ట్రీపరంగా సోషల్ మీడియా ఫేవరేట్ సెలబ్రిటీలను ఎంత దగ్గర చేస్తుందో అంతే ప్రమాదకరం అన్నట్లుగా మారింది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫేవరేట్ హీరోయిన్స్ కనిపిస్తే చాలు ఫాలోయర్స్ ఏదొక విధంగా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అంటే అందరి విషయంలో ఇలాగే జరుగుతుందని కాదు. కానీ కొందరికి మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అంటూ సోషల్ మీడియా అన్ని ఖాతాలలో హీరోయిన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం లేదా లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేయడం లాంటివి చేస్తుంటారు. అలా పోస్ట్ చేసినప్పుడు ఫ్యాన్స్ అయినా ఫాలోయర్స్ అయినా లైక్ కొట్టి ఊరుకుంటే సరిపోతుంది. లేదా అంతగా నచ్చితే కామెంట్ కూడా అందంగానే ఇబ్బంది కలగకుండా పెట్టాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో లక్షలమంది ఆ కామెంట్స్ చూస్తుంటారు.

అందులోను పెడుతుంది హీరోయిన్ కు కాబట్టి ఆలోచించాలి. తాజాగా అలాంటి బ్యాడ్ కామెంట్ ఎదుర్కొంది హీరోయిన్ ప్రియమణి. సోషల్ మీడియాలో ప్రియమణి ఇటీవలే బ్లాక్ అవుట్ ఫిట్ లో కాస్త గ్లామరస్ ఫోటోస్ పోస్ట్ చేసింది. అంటే నిజంగానే అందాల ప్రదర్శన జరిగిందనే చెప్పాలి. ఆ ఫొటోస్ చూస్తే చాలకాలం తర్వాత ప్రియమణి గ్లామరస్ ఫోటోస్ పోస్ట్ చేసేసరికి కుర్రకారు కొంచం కంట్రోల్ తప్పినట్లే అనిపిస్తుంది. ఐతే ఈ సందర్బంగా ఓ యూసర్ ప్రియమణిని 'నగ్నంగా ఓ పిక్ పోస్ట్ చేయండి' అని కామెంట్ చేసాడు. అంతే ప్రియమణి ఆ యూసర్ కు దిమ్మతిరిగే జవాబిచ్చింది. "ముందుగా మీ అక్కను లేదా మీ అమ్మను నగ్నంగా పోస్ట్ చేయమనండి. తరువాత నేను పోస్ట్ చేస్తాను" అంటూ ఘాటుగా స్పందించింది. ఆ దెబ్బతో యూసర్ వెంటనే 'సారీ' చెప్పాడు. కానీ ఆమెకి జరిగిన నష్టానికి సారీ అనేది సరిపోదు. ఇదివరకే పూజాహెగ్డే విషయంలో ఓసారి ఇలాగే జరిగింది. ప్రస్తుతం ప్రియమణి కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.