Begin typing your search above and press return to search.

ఆ హీరో అంటే అమ్మడికి అంత క్రష్.. ఓపెన్ గా చెప్పేసింది

By:  Tupaki Desk   |   15 Oct 2022 4:25 AM GMT
ఆ హీరో అంటే అమ్మడికి అంత క్రష్.. ఓపెన్ గా చెప్పేసింది
X
ఒకే ఒక్క పాట.. అందులోని ఒకే ఒక్క ఎక్స్ ప్రెషన్ తో ఇంటర్నెట్ ను షేక్ చేయటమే కాదు.. అశేష భారతానికి సుపరిచితం కావటమే కాదు.. దాదాపు ప్రతిఒక్క వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయిన సంచలన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. గతంలో మీ అభిమాన నటుడు ఎవరు? అన్న ప్రశ్నను వేస్తే.. సమాధానం చెప్పేందుకు చాలా ఇబ్బంది పడేవారు. ఆచితూచి అన్నట్లు సమాధానం చెప్పేవారు. ఇప్పుడు సీన్ మారింది.

మీకు ఇష్టమైన హీరో ఎవరంటే.. తడుముకోకుండా సమాధానం చెప్పేయటమే కాదు.. కొందరు హీరోయిన్లు అయితే ఏకంగా తాము ఇష్టపడే హీరోల పేరు.. క్రష్ ఉన్న హీరో పేరును కూడా చెప్పేస్తున్నారు. తాజాగా అలాంటి పనే చేశారు సంచలన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆధార్ లవ్ అనే మూవీతో పాపులర్ అయిన ఆమె.. మలయాళం.. తెలుగుతో పాటు హిందీ మూవీలు కూడా చేశారు.

తాజాగా ఆమె చూపు కోలీవుడ్ మీదకు మళ్లినట్లుగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో హీరో ధనుష్ కు సంబంధించిన విషయాల్ని తన ఇన్ స్టా లో షేర్ చేస్తూ.. అందరి అటెన్షన్ ను డ్రా చేస్తోంది. తాజాగా ఒక విలేకరి అడిని ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వటమే కాదు.. తన ఇన్ స్టాలో ధనుష్ కు సంబంధించిన పోస్టులు ఎందుకు పెడుతున్న విషయానికి జస్టిఫికేషన్ ఇచ్చేలా బదులు ఇవ్వటం గమనార్హం.

హీరో ధనుష్ అంటే తనకు క్రష్ అని.. అదోరకం పిచ్చి అని చెప్పేసిన ఆమె.. అతడి సరసన తాను నటించాలని చాలా కాలంగా కోరుకుంటున్న విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే ధనుష్ మూవీలో నటించే అవకాశం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం..

తెలుగులో ఒక మూవీ.. మలయాళంలో రెండు మూవీలు.. హిందీలో ఏకంగా మూడు మూవీల్లో నటిస్తున్న ప్రియా.. త్వరలోనే కోలీవుడ్ లో తాను కోరుకున్న ధనుష్ తో జత కట్టే అవకాశం లభించే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.