Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: తెలుగు నేర్చుకుంటున్న చ‌క్క‌న‌మ్మ‌లు

By:  Tupaki Desk   |   28 July 2021 6:36 AM GMT
ట్రెండీ స్టోరి: తెలుగు నేర్చుకుంటున్న చ‌క్క‌న‌మ్మ‌లు
X
మలయాళ అంద‌గ‌త్తెలు నిత్యా మీనన్ .. నివేదా థామస్ తెలుగును స్వ‌చ్ఛంగా మాట్లాడ‌తారు. కీర్తి సురేష్ అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌రు. ఈ భామ‌లు న‌టించే సినిమాల‌కు స్వ‌యంగా డబ్బింగ్ చెప్పుకుంటారు. త‌మిళ‌మ్మాయిలు త‌మ‌న్నా.. శ్రుతిహాస‌న్ కూడా తెలుగును సునాయాసంగా మాట్లాడ‌తారు. స్వ‌యంగా డ‌బ్బింగ్ చెబుతారు. న‌య‌న‌తార‌- త్రిష‌-ఇలియానా లాంటి భామ‌లు ఎప్ప‌టికీ తెలుగు మాట్లాడ‌లేరు. ఎందుకంటే వారు నేర్చుకునేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌లేదు.

అయితే వారిలా కాకుండా సాటి మ‌ల్లూ భామ‌ల్లానే ఆలోచించిన‌ మ‌రో మ‌ల‌యాళ బ్యూటీ తెలుగు నేర్చుకుంటోంది. వింక్ గాళ్ గా సుప‌రిచిత‌మైన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ గురించే ఇదంతా. కేర‌ళ‌కు చెందిన ఈ న‌టి ఇటీవ‌ల టాలీవుడ్ లో వ‌రుస చిత్రాల‌తో బిజీ అవుతోంది. ఇంత‌కుముందు నితిన్ స‌ర‌స‌న `చెక్` అనే మూవీలో న‌టించింది. ఆ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా ప్రియాకు టాలీవుడ్ లో అవ‌కాశాల‌కు కొద‌వేమీ లేదు. కానీ ఈ బ్యూటీ ఆచితూచి అడుగులు వేస్తూ ఒక్కో సినిమాకి సంత‌కం చేస్తోంది. ప్ర‌స్తుతం తేజ స‌జ్జా స‌ర‌స‌న ఇష్క్ అనే చిత్రంలో న‌టించింది. ఈనెల 30న ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది.

ప్రియా మరిన్ని చిత్రాలకు సంతకం చేయడానికి తెలుగు భాష నేర్చుకుంటుంది. అందుకోసం ఒక నిపుణుడైన తెలుగు ట్యూట‌ర్ ని నియ‌మించుకుంటోంద‌ని స‌మాచారం. ఈ వారాంతంలో విడుదలకు సిద్ధ‌మ‌వుతున్న ఇష్క్ ప్ర‌మోష‌న్స్ లో తెలుగులో ఆక‌ట్టుకోవాల‌న్న ప్లాన్ తో ఉందిట‌. ఇటీవ‌లే మ‌రో తెలుగు చిత్రానికి కూడా సంతకం చేసినట్లు మీడియాకు తెలియజేసింది. ప్రియాకు తెలుగులోనూ చ‌క్క‌ని ఫాలోయింగ్ ఉంది. అందువ‌ల్ల భాష నేర్చుకుంటే మ‌రింత సౌక‌ర్యంగా ఉంటుంది. నిత్యామీన‌న్ త‌ర్వాత మ‌ళ్లీ ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసేందుకు ఈ రింగుల జుత్తు చిన్న‌ది ప్ర‌య‌త్నిస్తుందేమో చూడాలి. అయితే వింక్ బ్యూటీకి తెలుగు ట్యూష‌న్ చెప్పే ల‌క్కీ గ‌య్ ఎవ‌రో తెలియాల్సి ఉంది.

ఇటీవ‌ల టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ నటీమణులు శ్ర‌ద్ధా క‌పూర్ -ఆలియా భట్ - కృతి సనోన్ తెలుగు నేర్చుకునేందుకు శిక్ష‌కుల‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఆలియా పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఏరికోరి ఆలియాను బ‌రిలో దించారు. అలాగే ప్ర‌భాస్ స‌ర‌స‌న ఆఫ‌ర్ రాగానే వెంట‌నే ఓకే చెప్పేసింది కృతి స‌నోన్. చాలా గ్యాప్ త‌ర్వాత ఈ బ్యూటీ తెలుగులో ఎంట్రీ ఇస్తూ ఇప్పుడు తెలుగు భాష‌పై ప‌ట్టు సంపాదించేందుకు ప్ర‌య‌త్నిస్తోందంటే మునుముందు ఇక్క‌డ భారీ ప్లానింగ్ తో ఉంద‌న్న‌మాట‌.

తెలుగ‌మ్మాయిలు త‌మిళం అన‌ర్గ‌ళంగా

ఇంత‌కుముందు నిహారిక త‌మిళ చిత్రాల్లో న‌టించేందుకు త‌మిళ ట్యూటర్ ని నియ‌మించుకున్న సంగ‌తి తెలిసిన‌దే. నిహారిక న‌టిస్తున్న వెబ్ సిరీస్ ల‌కు తెలుగు-త‌మిళంలో ఆద‌ర‌ణ ఉంది. మునుముందు తాను పెద్ద తెర‌పై మ‌రిన్ని చిత్రాల్లో న‌టించే అవ‌కాశం ఉంది. ఇక తెలుగ‌మ్మాయిలు క‌ల‌ర్స్ స్వాతి.. బిందు మాధ‌వి వంటి వారు ఇరుగు పొరుగు భాష‌ల్ని నేర్చుకుని అవ‌కాశాలు అందుకున్నారు. బిందుమాధ‌వి త‌మిళంలో సుదీర్ఘ కాలం కెరీర్ ని సాగించ‌డానికి కార‌ణం త‌న భాషా నైపుణ్యం. ఇటీవ‌ల బ‌స్ స్టాప్ ఫేం ఆనందిత త‌మిళం నేర్చుకుని అక్క‌డ ఇండ‌స్ట్రీలో క్రేజీ ఆఫ‌ర్ల‌తో రాణిస్తున్నారు. ప్రాంతం ఏదైనా భాష ముఖ్యం. స్థానిక భాష నేర్చుకుంటే మ‌రిన్ని అవ‌కాశాల్ని అందిపుచ్చుకోవ‌డం క‌థానాయిక‌ల‌కు సులువైన ప‌ని.