Begin typing your search above and press return to search.
ప్రియా వారియర్ కష్టాలివీ..
By: Tupaki Desk | 27 May 2018 6:09 AM GMTప్రియా వారియర్.. ఒక్క కన్ను గీటి యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకుంది.. ఒక ట్రైలర్ తో దేశవ్యాప్తంగా ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ కేరళ కుట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం చేసినా ట్రెండింగే.. క్యూట్ క్యూట్ లుక్స్ తో చూడ ముచ్చటైన మోముతో ప్రియా విడుదల చేసే వీడియోలకు లక్షల్లో లైక్ లు వస్తున్నాయి. ఈమెను ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇలా అప్ డేట్ పెట్టగానే అలా లక్షల్లో లైకులు - కామెంట్స్ వచ్చిపడుతున్నాయి.
తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ ఆసియానెట్ అవార్డ్స్-2018 సినీ ఫంక్షన్ లో పాల్గొంది. ఆ కార్యక్రమానికి ఒక బ్లాక్ లాంగ్ గౌనును వేసుకొని వచ్చింది. ఆ డ్రెస్సులో ఓ బొమ్మలా కనపడింది. కానీ ఆ డ్రెస్ బరువు బాగా ఉంది. దాన్ని మోయడానికి ఆపసోపాలు పడింది. ఆ డ్రెస్ బరువుగా ఉండడంతో ఆమె ఒక సహాయకురాలిని కూడా నియమించుకొని గౌనును మోసే భారంలో ఆమెను పాలుపంచుకోనిచ్చింది.
ఇప్పుడీ వీడియో బయటకు వచ్చాక అందరూ ప్రియాపై అందరూ సెటైర్లు వేస్తున్నారు. ఆసియానెట్ ఫంక్షన్ లో ఆమె గేటు నుంచి ఎంతో కష్టపడుతూ గౌను ను మోయలేక.. ఓ అసిస్టెంట్ సాయంతో భారంగా వేదిక మీదకు రావడం వీడియోలో కనిపించింది. ఆమెకు ఎంత స్టార్ డం ఉన్నా.. ఇలా వేదికలపై ఆ దర్పం ప్రదర్శించేందుకు చేసిన ఈ ప్రయత్నం నవ్వులపాలైంది.. సినిమాల్లో ఏదీ వేసినా అదే ఆ షాట్ వరకే అందంగా ఉంటుంది. కానీ బయట కూడా అలాంటి డ్రెస్ లు వేసుకొని ప్రియా పడిన పాట్లు చూశాక అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి