Begin typing your search above and press return to search.
ట్రైనింగ్ తీసుకోమ్మా ప్రియా
By: Tupaki Desk | 21 April 2018 4:45 AM GMTఓరగా చూస్తూ కన్నుగొట్టి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది మళయాళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. సినిమాలో లవర్ ను పడేయడం కోసం ఆమె కన్ను కొట్టినా ఇండియాలో కోట్లాది మంది కుర్రాళ్లు ఆమెకు పడిపోయారు. ఒక్కసారి ప్రియా ప్రకాష్ ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయింది. ఆమె కన్నుకొట్టుడుకు లక్షలాది మంది ఫిదా అయిపోయారు.
మళయాళ సినిమా ఒరు అడార్ లవ్ తో ప్రియా ప్రకాష్ వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ ట్రయిలర్లతోనే ఆమె ఫేమస్ అయింది. అప్పటి నుంచి కొత్త కొత్త ఫోజులతో ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తోంది. తాజాగా తన సెక్సప్పీల్ చూపిద్దామని అనుకుని స్లీవ్ లెస్ డ్రస్ తో ఫొటోకు ఫోజిచ్చింది. కానీ ఈ ఫోజు ఆమె ఇమేజ్ కు డ్యామేజ్ తెచ్చేలా ఉంది తప్ప గొప్పగా లేదు. మోడల్ తరహాలో ఫొజులివ్వడం... డ్రస్సింగులతో మెప్పించడం కన్ను కొట్టినంత ఈజీ కాదని అమ్మడికి ఇంకా అర్ధమైనట్టు లేదు.
ప్రియా వారియర్ కు వచ్చిన ఫాలోయింగ్ తో ఆమెను తమ సినిమాల్లో నటింపజేయడానికి బాలీవుడ్ నుంచి లోకల్ మళయాళం నిర్మాతల వరకు ఆమె తెగ ప్రయత్నించారు. కానీ మొదటి సినిమా ఇంకా పూర్తవకపోవడంతో ఆమె కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. గ్లామర్ డాల్ గా రాణించాలని అనుకునే పక్షంలో కన్నుకొట్టడంతో సరిపెట్టకుండా కాస్తంత ట్రైనింగ్ తీసుకోవాలంటూ నెటిజన్లు ఆమెకు సలహా ఇస్తున్నారు.