Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు షాక్..ఆమెకు మాత్రం పండగేనట
By: Tupaki Desk | 21 July 2018 5:18 AM GMTఒకరికి షాక్ గా మారిన వ్యవహారం.. మరొకరికి అంతులేని ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉందా? అంటే.. ఉందనే చెప్పాలి. తాజాగా మోడీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఒక సెలబ్రిటీని మళ్లీ పాపులర్ అయ్యేలా చేసింది. మోడీపై అవిశ్వాసం ఏంది?.. ఒక సెలబ్రిటీ మళ్లీ పాపులర్ కావటమా? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది నిజం. ఎందుకంటే.. అందుకు సోషల్ మీడియానే సాక్ష్యంగా చెప్పాలి.
అవిశ్వాస తీర్మానంపై సాగిన చర్చలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. అనంతరం మోడీ దగ్గరకు వెళ్లి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు. ఈ వ్యవహారం ప్రధాని మోడీని సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. అనంతరం రాహుల్ తన సీటు వద్దకు వచ్చి కూర్చునేటప్పడు కాంగ్రెస్ నేతలంతా హర్షద్వానాలు చేస్తూ.. రాహుల్ చేసిన పనిని అభినందించారు.
సభలోనూ ఒకలాంటి వాతావరణం చోటు చేసుకుంది. రాహుల్ తన చర్యతో సీన్ మొత్తాన్ని మార్చేసినట్లుగా మారింది. స్పీకర్ సైతం ఈ వ్యవహారాన్ని చూస్తుండిపోయారు. ఈ ఎపిసోడ్ లో రాహుల్ ది పైచేయిగా కనిపించింది. అయితే.. అది కేవలం కొన్ని సెకన్లు మాత్రమే. ఏమైందో ఏమో కానీ.. చుట్టూ కెమేరాలు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయారో ఏమో కానీ.. తన సహచర సభ్యుడి వంక చూస్తూ రాహుల్ కన్నుగీటిన వైనం కెమేరా కంటికి దొరికిపోయింది.
ఇక.. అప్పటి నుంచి రాహుల్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కౌగలింతతో డిఫెన్స్ లో పడిన బీజేపీ నేతలు గొంతు సవరించుకొని.. రాహుల్ చర్యను తప్పు పట్టారు. స్పీకర్ సైతం సరైన పద్ధతి కాదన్నారు. వీరి సంగతి ఇలా ఉంటే.. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హాట్ చర్చకు తెర తీసింది. ఎటకారం చేసుకునేందుకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది.
ఇక.. ఎవరికి వారు చెలరేగిపోయారు. రాహుల్ మీద దునుమాడేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవటానికి ఏ మాత్రం ఇష్టం లేని వారు తమ క్రియేటివిటికి పదును పెట్టారు. అంతే.. కాసేపటికే రాహుల్ హగ్గుతో పాటు కన్నుగీటిన వైనంపై ఎటకారం చేసుకోవటం మొదలైంది. మరికొందరు మరో అడుగు ముందుకేసి.. ఆ మధ్యన కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్ కన్నుగొట్టే దృశ్యాన్ని పక్కన పెట్టి.. ఎవరు బాగా కన్నుగీటారన్న దానిపై పోస్టులు పెట్టటం మొదలెట్టారు.
కాసేపటికే హ్యాష్ టాగ్స్.. మీమ్స్ తో రాహుల్ ను ట్రోల్ చేయటం షురూ చేశారు. దీంతో.. కాంగ్రెస్ వర్గాలు దీన్ని ఎదుర్కొనటానికి కిందామీదా పడుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. మరోవైపు ప్రియా ప్రకాశ్ వారియర్ మాత్రం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ప్రియా వారియర్ ను మించి పోయారు.. ప్రియా వారియర్ కు గట్టి పోటీ ఇస్తున్నారు.. ఇక మీదన తనను ఎవరూ పట్టించుకోరని ప్రియా వారియర్ ఆందోళన చెందుతున్నారంటూ రాహుల్ ను ఆమెతో పోల్చి పోస్టుల మీద పోస్టులు పెట్టేసి ఎటకారం ఆడేశారు. ఇదిలా ఉంటే.. బుద్దిగా కాలేజీకి వెళ్లి ఇంటికి వచ్చిన ప్రియా వారియర్ కు జరిగిన విషయాలేవీ తెలీవట. వాళ్లమ్మ ఎదురొచ్చి.. మళ్లీ నువ్వు పాపులర్ అయిపోయావ్.. దేశమంతా నీ చర్చే జరుగుతోందని చెప్పటంతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోయిడట.
రాహుల్ పరిస్థితి ఏమిటన్నది పక్కన పెడితే.. రాహుల్ కారణంగా తాను మరోసారి పాపులర్ కావటంపై తెగ సంతోషపడిపోతోంది. రాహుల్ సార్ తో నన్ను పోల్చటం హ్యాపీగా ఉంది. ఆయనతో కలిపి టీవీల్లో చూపిస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ పాపులర్ అయిపోయానంటూ గెంతులేస్తుందట. ఒకరికి షాకింగ్ గా మారిన వైనం.. మరొకరికి ఎంత సంతోషంగా మారిందో కదూ..!