Begin typing your search above and press return to search.
ఆ హీరోల పేర్లు చెప్పాలంటే భయం : ప్రియా
By: Tupaki Desk | 7 Sep 2019 7:18 AM GMTమలయాళం మూవీ 'ఒరు ఆదార్ లవ్' చిత్రంలోని కన్ను గీటే సీన్ మరియు ముద్దుగన్ పేల్చే సీన్స్ తో ప్రియా వారియర్ ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్షేషన్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల కాకుండానే ప్రియా వారియర్ కు స్టార్ స్టేటస్ దక్కింది. ప్రియా వారియర్ కు వచ్చిన క్రేజ్ తో ఆ సినిమాను తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల చేశారు. కాని సినిమా ఫలితం బెడిసి కొట్టింది. అయినా కూడా ఆమెకు దక్కిన క్రేజ్ తో పలు భాషల నుండి ఆఫర్స్ వచ్చాయి.
ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ప్రియా వారియర్ తాజాగా కన్నడంలో 'విష్ణు ప్రియ' అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో ఒక కన్నడ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సందర్బంగా ఆమెను జర్నలిస్ట్ మీకు ఏ హీరో అంటే ఇష్టం.. ఎవరితో సినిమా చేయాలని కోరుకుంటారు అంటూ ప్రశ్నించారు. అప్పుడు ఆమె చాలా గడుసుగా సమాధానం చెప్పింది. నన్ను ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. కాని నేను మాత్రం సమాధానం చెప్పను. ఎందుకంటే ఒక హీరో పేరు చెబితే మరో హీరో నుండి అవకాశాలు రావు. అందుకే ఒక్కరు ఇద్దరు హీరోల పేర్లు చెప్పాలంటే భయం అంటూ ప్రియా వారియర్ గడుసుగా సమాధానం ఇచ్చింది.
ఒరు ఆదార్ లవ్ చిత్రం తర్వాత ఈమె చేసిన కీలక చిత్రం 'శ్రీదేవి బంగ్లా'. ఇప్పటికే ఈ చిత్రం విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా టీజర్ విడుదలైన వెంటనే సినిమా చుట్టు వివాదం రాజుకుంది. తన భార్య జీవిత చరిత్ర ఆధారంగా తన అనుమతి లేకుండా సినిమా తీశారు అంటూ బోణీ కపూర్ కోర్టులో కేసు వేశాడు. దాంతో 'శ్రీదేవి బంగ్లా' చిత్రం విడుదలకు నోచుకోవడం లేదు. ఆ చిత్రం విడుదలైతే నటిగా ప్రియా వారియర్ కు మంచి మార్కులు పడతాయని అంటున్నారు. టైటిల్ మార్చడంతో పాటు సినిమాలో పలు సీన్స్ పై తమకున్న అభ్యంతరాలను పరిశీలించి, వాటిని తొలగించిన తర్వాత సినిమా విడుదల చేసుకోవాలంటూ బోణీకపూర్ పిటీషన్ లో పేర్కొన్నారు.