Begin typing your search above and press return to search.
అతడు చెప్పింది విన్న రెండు రోజులకే ఓకే చెప్పేసిందట
By: Tupaki Desk | 28 July 2021 4:29 AM GMTకన్నుగొట్టటం చాలామందే చేసి ఉంటారు. రీల్ లోనూ.. రియల్ లోనూ. కానీ.. కన్నుగీటిన వైనంతో యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేయటమే కాదు.. ఓవర్ నైట్ సెలబ్రీటీగా మారిన లక్ మాత్రం ముద్దుగుమ్మ ప్రియా వారియర్ అని చెప్పక తప్పదు. ఆమె కన్నుగొట్టిన వైనానికి యూత్ మాత్రమే కాదు వయసుతో సంబంధం లేకుండా కనెక్టు అయిపోయారు. అదే.. ప్రియావారియర్ కు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టింది.
మలయాళంలో సినిమాలు చేసిన ఆమె తెలుగులోనూ నటించింది. అయితే.. ఆమె పూర్తి స్థాయిలో నటించిన చిత్రం తాజాగా విడుదల కానున్న ‘ఇష్క్’. సినిమా మొత్తం కనిపించే ఆమెకు.. ఈ సినిమా మీద చాలానే అంచనాలు ఉన్నాయి. దీని ఒరిజినల్ అయిన మలయాళం ‘ఇష్క్’ మూవీని తాను చూశానని చెప్పారు. సాధారణంగా తాను సినిమాల్ని ఓకే చేయాలంటే.. కథ విన్నాక కాస్త ఆలోచించిన తర్వాత మాత్రమే ఓకే చేస్తానని చెబుతోంది.
అయితే.. ఇష్క్ ఆఫర్ కు మాత్రం తాను భిన్నంగా వ్యవహరించానని చెబుతోంది. దర్శకుడు కథ చెప్పిన తర్వాత పెద్దగా ఆలోచించలేదని.. కేవలం రెండు రోజుల్లోనే తన నిర్ణయాన్ని చెప్పేసినట్లుగా వెల్లడించింది. ఇష్క్ గురించి చెప్పిన రెండు రోజులకే నిర్ణయం తీసుకోవటంతో పాటు.. సెట్ లో ఉన్నట్లు చెప్పింది. అంతలా తాను సినిమాకు కనెక్టు అయినట్లు చెప్పింది.
రోటీన్ గా చూసే ప్రేమకథలా ఈ మూవీ ఉండదని.. ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుందని.. యూత్ తమ జీవితాల్లో ఎదుర్కొనే కీలక సమస్యను ఈ సినిమా టచ్ చేస్తుందని చెప్పింది. ఇంతకీ ఆ ఇష్యూ ఏమిటన్న విషయాన్ని మాత్రం తాను రివీల్ చేయలేనని స్పష్టం చేసింది. గతంలో తాను చేసిన సినిమాలకు భిన్నంగా.. ఇష్క్ కు చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నానని చెప్పిన ప్రియ మాటలు ఇష్క్ మీద అంచనాల్ని మరింత పెంచేలా ఉన్నాయని చెప్పక తప్పదు.