Begin typing your search above and press return to search.

రామ్ జోడీగా ప్రియా ప్రకాశ్ వారియర్?

By:  Tupaki Desk   |   27 April 2021 12:30 AM GMT
రామ్ జోడీగా ప్రియా ప్రకాశ్ వారియర్?
X
రామ్ హీరోగా ఇటీవల వచ్చిన 'రెడ్' సినిమా ఆశించినస్థాయిలో ఆడలేదు. దాంతో ఆయనతో పాటు అభిమానులంతా కూడా నిరుత్సాహపడ్డారు. ఆ తరువాత పెద్దగా గ్యాప్ లేకుండా రామ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆయన తాజా చిత్రం లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి కనిపిస్తోంది. ఆ తరువాత రామ్ చేయనున్న సినిమాలో హీరోయిన్ గా ప్రియా ప్రకాశ్ వారియర్ కనిపించే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది.

తెలుగులో ప్రియా ప్రకాశ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఇటీవల నితిన్ సినిమా 'చెక్'లో మెరిసిన ఈ పిల్ల, ఆ తరువాత సినిమాగా 'ఇష్క్' చేసింది. తేజ సజ్జా జోడీగా నటించిన ఈ అమ్మాయి ప్రస్తుతం తన దూకుడు పెంచే పనిలో ఉంది. ఈ అమ్మాయిని సంప్రదిస్తున్న దర్శక నిర్మతల సంఖ్య ఎక్కువగానే ఉందని అంటున్నారు. తెలుగు కథలను వినడంపైనే ఈ సుందరి ఇప్పుడు ఎక్కువ దృష్టి పెట్టిందని చెబుతున్నారు. ఈ సుందరి మొగ్గుచూపిన సినిమాల్లో రామ్ నెక్స్ట్ మూవీ కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది.

రామ్ తదుపరి సినిమా మారుతి దర్శకత్వంలో ఉండనుందనే ఒక వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్న మారుతి, ఆ తరువాత సినిమాను రామ్ తో చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆయన సినిమా కోసం ప్రియా ప్రకాశ్ ను అడిగారా? లేదంటే అంతకంటే ముందుగానే సెట్ చేసిన మరో ప్రాజెక్టు ఏదైన ఉందా? పోతే ఇదంతా పుకారిస్టుల పనేనా? అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది. మొత్తానికి ప్రియా ప్రకాశ్ జోరు అయితే మాత్రం నెమ్మది నెమ్మదిగా పెరుగుతోందనే విషయం మాత్రం అర్థమవుతోంది.