Begin typing your search above and press return to search.

#వింక్ గాళ్ .. త్రిస్సూర్ యువ‌రాణినే త‌ల‌పిస్తోంది

By:  Tupaki Desk   |   30 April 2021 3:30 AM GMT
#వింక్ గాళ్ .. త్రిస్సూర్ యువ‌రాణినే త‌ల‌పిస్తోంది
X
ప్రియా ప్రకాష్ వారియ‌ర్ .. ఓవ‌ర్ నైట్ సెన్సేష‌న్ గా సుప‌రిచితం. మ‌ల‌యాళ మూవీ ఒరు ఆధార్ ల‌వ్ ఈ బ్యూటీని వింక్ గాళ్ గా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. న‌టించిన తొలి సినిమాతోనే ప్రియా పేరు మార్మోగింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ స‌హా తెలుగు చిత్ర‌సీమ‌లోనూ ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి.

ఒకే ఒక్క క‌న్నుగీటుతో ప్రియా గొప్ప స్టార్ అయ్యింది. ఇటీవ‌లే నితిన్ స‌ర‌స‌న చెక్ అనే చిత్రంలో న‌టించింది. ఈ సినిమా ఫ‌లితం నిరాశ‌ప‌రిచినా ప్రియా అంద‌చందాల‌కు ఫాలోయింగ్ పెరిగింది. ఇక మ‌రో న‌వ‌త‌రం హీరో తేజ స‌జ్జా స‌ర‌స‌న ఇష్క్ అనే చిత్రంలో ప్రియా వారియ‌ర్ క‌థానాయిక‌గా న‌టించింది. తదుప‌రి ఇస్మార్ట్ బోయ్ రామ్ స‌ర‌స‌న ఓ చిత్రానికి సంత‌కం చేసింద‌ని తెలిసింది. మారుతి ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. మ‌రోవైపు రామ్ ప్ర‌స్తుతం లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు.

ప‌నిలో ప‌నిగా ప్రియా ప్ర‌కాష్ కి సోష‌ల్ మీడియాలో అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డిన‌ సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్రియా మెడ‌నిండా బంగారు వ‌జ్రాభ‌ర‌ణాలు ధ‌రించి మ‌హారాణినే త‌ల‌పిస్తోంది. ఒక ర‌కంగా త్రిస్పూర్ యువ‌రాణి వేంచేసిన‌ట్టుగా ఉంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. భారీ ఆభ‌ర‌ణాల అలంక‌ర‌ణ‌తో ప్రియా ఎంతో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తూ యువ‌త‌రానికి క‌నెక్ట‌యిపోయింది.