Begin typing your search above and press return to search.

సీపీఐ పోస్ట‌ర్ల పై వారియ‌ర్ `వింక్` పిక్....వైర‌ల్!

By:  Tupaki Desk   |   4 March 2018 9:27 AM GMT
సీపీఐ పోస్ట‌ర్ల పై వారియ‌ర్ `వింక్` పిక్....వైర‌ల్!
X
``అగ్గిపెట్టె....స‌బ్బు బిళ్లా....కుక్క పిల్ల‌.....కాదేదీ క‌వితక‌న‌ర్హం....``అన్నారు మ‌హాక‌వి శ్రీ‌శ్రీ‌. ఆ మ‌హాక‌వి చెప్పిన మాట‌ల‌ను ప్ర‌స్తుతం కొంత‌మంది తూ.చ త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. ప‌బ్లిసిటీ కోసం నానా పాట్లు ప‌డుతూ....ర‌క‌ర‌కాల ఫీట్లు చేస్తున్నారు. కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల ప్ర‌మోష‌న్ కోసం....సినిమా పేర్ల‌ను - సినీ తార‌ల‌ను బ్రాండ్ అంబాసిడర్ గా వాడుకోవ‌డం చూశాం. రాజ‌కీయ పార్టీల త‌ర‌ఫున కొంద‌రు సినీ తార‌లు ప్ర‌చారం నిర్వ‌హించ‌డం కూడా స‌ర్వ సాధారణం. అయితే, కేర‌ళ‌లో సీపీఐ ప‌బ్లిసిటీ పిచ్చ పీక్స్ కు చేరుకుంది. ``క‌న్నుగీటి``కుర్రాళ్ల మ‌న‌సుల‌ను కొల్ల‌గొట్టిన మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఫొటోను ఆ పార్టీ త‌మ పోస్ట‌ర్ పై ప్ర‌చురించింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ పోస్ట‌ర్ వైర‌ల్ అయింది.

సాధార‌ణంగా సీపీఐ పార్టీ విప‌రీత ధోర‌ణుల‌కు - పోక‌డ‌ల‌కు దూరంగా ఉంటుంది. కానీ, ఈ సారి వెరైటీగా త‌మ స‌మావేశాల‌కు సంబంధించిన ప్ర‌చార పోస్ట‌ర్ లో ఆ పార్టీ విల‌క్ష‌ణ‌త‌ను చాటుకుంది. కేరళలోని మలప్పురంలో ఈ నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు సీపీఐ రాష్ట్ర కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ ప‌బ్లిసిటీ పోస్టర్లను `ఒరు ఆదార్ లవ్` చిత్రం పోస్టర్ త‌ర‌హాలో డిజైన్ చేశారు. అంతేకాదండోయ్ - ఆ పోస్ట‌ర్ల‌లో క‌న్నుగీటుతున్న ప్రియా ఫోటోను కూడా ప్రింట్ చేశారు. కేర‌ళ‌లో ప‌లు చోట్ల ఈ పోస్టర్ ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఇది వైర‌ల్ అయింది. సీపీఐకి చెందిన యూత్ వింగ్ ఏఐఎస్ ఎఫ్ ఈ పోస్టర్ ను డిజైన చేయించుకుంది. అయితే, త‌మ స‌మావేశాల‌కు రావాల‌ని ప్రియా క‌న్నుకొట్టి పిలుస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్ట‌ర్ల‌పై నెటిజ‌న్ల నుంచి భిన్న స్పంద‌న వ‌స్తోంది. త‌మ మీటింగ్ కు క్రేజ్ రావ‌డం కోసం సీపీఐ ఈ విధంగా చేయ‌డం....ఆ పార్టీ కి త‌గ్గుతున్న ప్ర‌జాద‌ర‌ణ‌కు నిద‌ర్శ‌న‌మ‌ని కొంద‌రు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, ప‌బ్లిసిటీ కోసం ట్రెండింగ్ లో ఉన్న ప్రియా `వింక్` పోస్ట‌ర్ వాడుకోవ‌డంలో త‌ప్పేమీ లేద‌ని మ‌రి కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.