Begin typing your search above and press return to search.
గీటిన కన్ను వాచిపోయింది
By: Tupaki Desk | 15 Feb 2019 5:29 AM GMTఏడాది క్రితం చిన్న టీజర్ లో సీన్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియ ప్రకాష్ వారియర్ మొదటి సినిమా ఒరు ఆధార్ లవ్ తెలుగులో లవర్స్ డే పేరుతో బాగానే హంగామా చేసుకుంటూ థియేటర్లలోకి అడుగు పెట్టింది. సరే ఒక్క సన్నివేశానికే గుండెలు కొల్లగొట్టింది కదా ఇక సినిమాలో ఇంకేమేం చేసిందో అనుకుని సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులకు పట్టపగలే చుక్కులు కనిపించి సినిమా పూర్తి కాకుండానే పరిగెత్తుతున్నారని పూర్తి నెగటివ్ రిపోర్ట్స్ వచ్చేసాయి. తీసికట్టు మేకింగ్ తో సహనానికి పరీక్ష పెట్టిన దర్శకుడు ఒమర్ లుల్లు దీని మీద క్రేజ్ ను కనీసం ఓ పది శాతం వాడుకున్నా ప్రాజెక్ట్ సేఫ్ అయ్యేది. ఆ ఛాన్స్ చేతులారా పోగొట్టుకున్నాడు.
సరే సినిమా పోతే పోయింది ప్రియా వారియర్ పెర్ఫార్మన్స్ తన అందాన్ని చూసుకుని మురిసిపోదాం అనుకున్న ప్రేక్షకులకు ఆ భాగ్యం కూడా మిగల్లేదు. కారణం తన కంటే మరో హీరొయిన్ నూరిన్ షరీఫ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉండటం. నిజానికి ఆ అమ్మాయే బాగా చేసింది. దర్శకుడికే వాడుకోవడం చేత కాలేదు. ఇప్పుడు మబ్బులు తొలగిపోయాయి. వింక్ బ్యూటీగా సెన్సేషన్ సృష్టించిన ప్రియ వారియర్ నేలపైకి వచ్చేసింది. ఇక ఆ హైప్ ఎంత మాత్రం పని చేసే అవకాశం లేదని తేలిపోయింది.
నిన్న ప్రేమికుల రోజు కాబట్టి కొద్దోగొప్పో యూత్ తో ఓపెనింగ్స్ వచ్చాయి కాని మాములు సందర్భంలో సాయంత్రానికే ఖాళీ హాళ్ళు దర్శనమిచ్చేవని ఎగ్జిబిటర్ల టాక్. మరీ ఇంత తీసికట్టు సినిమాతో వస్తే ప్రియా వారియర్ కాదు ఇంకెవరైనా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. ఆ టీజర్ వచ్చిన వేడిలోనే తక్కువ టైంలో రిలీజ్ చేస్తే ఎలా ఉండేదో కాని ట్రైన్ జీవిత కాలం లేట్ తరహలో ఒమర్ లుల్లు ఓవర్ కాన్ఫిడెన్స్ కు అందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది