Begin typing your search above and press return to search.
పీకే వద్ద ప్లాప్ గురించి చర్చించిన అభిమాని!
By: Tupaki Desk | 8 May 2022 3:30 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ర్టాల్లో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న స్టార్. ఓ నటుడిగా కన్నా వ్యక్తిగతంగా అభిమానించే ఏకైక స్టార్ పీకే. పరిశ్రమ లో యంగ్ స్టార్స్ల ఎంతో మంది ఆయన్ని అభిమానిస్తారు...ఆరాదిస్తారు. యూత్ స్టార్ నితిన్ ని పీకే గురించి మాట్లాడమంటే ఏ రేంజ్ లో స్పీచ్ ఇస్తాడో చెప్పాల్సిన పనిలేదు.
అదంతా పీకేపై అతనికి ఉన్న అభిమానం. అలాంటి అభిమానుల్లో కమెడీయన్ ప్రియదర్శి ఒకడని నిరూపించుకున్నాడు. పీకెపై తనకున్న అభిమానాన్ని ట్విటర్లో షేర్ చేసాడు. ట్విటర్లో పీకేని కలిసిన ఫోటోలు షేర్ చేస్తూ ఇలా రాశౄడు. ``నేను ఎప్పటిలాగే సారధి స్టూడియోకి వెళ్లాను. కానీ ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైనది. విభిన్నమైనది. చుట్టు పక్కల జనం అంతా ఒకటే హడావుడిగా ఉన్నారు. అందరి కళ్లలో ఉత్సాహం..మెరుపు కనిపిస్తుంది.
అంతా ఒక్కటై మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు అంట కదా? అని. దీంతో నేను కూడా అవకాశంగా భావించి ఆయన్ని కలవాలని డిసైడ్ అయ్యాను. పీకేని కలిసి జానీ సినిమా గురించి చెప్పాలని నిర్ణయించుకున్నా. అది జరిగింనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కేవలం హరీష్ శంకర్ వల్లే సాధ్యమైంది. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు` అని ట్విటర్లో రాసుకొచ్చారు.
దీంతో ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పీకే గురించి ఆ పోస్ట్ చదివి అభిమానులు మురిసిపోతున్నారు. నెటి జనులు జానీ సినిమాని ఇన్నాళ్లు తక్కువగా అంచనా వేసారు అన్న పాయింట్ ని లేవనెత్తారు. అయితే ఈ సినిమా పీకె కెరీర్ లో ఓ ప్లాప్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మద్య 2003లో రిలీజ్ అయిన ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ నటిస్తూ నిర్మించారు.
అల్లు అరవింద్ నిర్మించారు. కానీ బాక్సాఫీస్ ఫలితం తీవ్ర నిరాశని మిగిల్చింది. కానీ ఈ సినిమా అంటే పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఆ మాట చెబుతుంటారు. ఓ సెక్షన్ ఆడియన్స్ ని ఈ సినిమా అప్పట్లో మెప్పించింది.
ఇక ప్రియదర్శి కూడా పీకే ని బాల్యం నుంచే అభిమానించడం మొదలు పెట్టారుట. ఆయన సినిమాలేవి థియేటర్లో మిస్ అవ్వరుట. ఆ వయసులోనే పీకేని ఒక్కసారైనా కలవాలని అనుకునేవాడుట. ఆ సమయం ఇన్నాళ్లకు వచ్చిందని సంతోషం వ్యక్తం చేసాడు. ఇప్పుడు పీకే తో కలిసి నటించే అవకాశం సైతం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.